
హైదరాబాద్: స్వామి పరిపూర్ణానంద హైద్రాబాద్ నగర బహిష్కరణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆయనకు నగర బహిష్కరణ నుండి ఊరట లభించింది.
శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిని హైద్రాబాద్ నగరం నుండి బహిష్కరిస్తున్నట్టు జూలై 11వ తేదీన పోలీసులు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.
గత ఏడాది నవంబర్ మాసంలో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలపై హైద్రాబాద్ పోలీసులు ఆయనను నగర బహిష్కరణ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకొన్నారు.
ఆరు మాసాల పాటు హైద్రాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధి నుండి స్వామి పరిపూర్ణానందను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పరిపూర్ణానంద మంగళవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.
స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో స్వామి పరిపూర్ణానందకు ఊరట లభించింది. అయితే హైకోర్టు నిర్ణయంపై పోలీసులు ఏ రకంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణకు ఒక్క రోజు ముందే సినీ విశ్లేషకుడు కత్తిమహేష్‌ను కూడ నగరం నుండి ఆరు మాసాల పాటు బహిష్కరించారు. కత్తి మహేష్ బహిష్కరణపై కొన్ని దళితసంఘాలు పలు ప్రశ్నలను లేవనెత్తడంతో మరునాడే పరిపూర్ణానందస్వామిని నగరం నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.