మ‌రిన్నిఉద్య‌మాలు చేస్తాం.. కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజల ముందు ఎండగడుతాం.. : బీజేపీ

By Mahesh Rajamoni  |  First Published Sep 15, 2023, 10:20 AM IST

Hyderabad: కేసీఆర్ ప్రభుత్వ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ఎండగట్టేందుకు బీజేపీ మరిన్ని ఉద్యమాలు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎన్నిక‌ల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీజేపీ శాంతియుతంగా చేస్తున్న నిరసనలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను మోసం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు కాబట్టే హైదరాబాద్ లో బీజేపీ దీక్షను భగ్నం చేయడానికి బలప్రయోగం చేశారని జవదేకర్ విమ‌ర్శించారు.
 


Telangana BJP: కేసీఆర్ ప్రభుత్వ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ఎండగట్టేందుకు బీజేపీ మరిన్ని ఉద్యమాలు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎన్నిక‌ల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీజేపీ శాంతియుతంగా చేస్తున్న నిరసనలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను మోసం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు కాబట్టే హైదరాబాద్ లో బీజేపీ దీక్షను భగ్నం చేయడానికి బలప్రయోగం చేశారని జవదేకర్ విమ‌ర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల ముందు ఎండగట్టేందుకు వచ్చే 100 రోజుల్లో వివిధ ప్రచార కార్యక్రమాలు చేపడతామని కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జీ ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. బీజేపీ శాంతియుతంగా చేస్తున్న నిరసనలను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను మోసం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు కాబట్టే హైదరాబాద్ లో బీజేపీ దీక్షను భగ్నం చేయడానికి బలప్రయోగం చేశారని జవదేకర్ అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్షను గురువారం విరమించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో దీక్ష విరమించేందుకు కిషన్ రెడ్డికి  జ‌వ‌దేక‌ర్ నిమ్మరసం అందించారు.

Latest Videos

ఇందిరాపార్కు వ‌ద్ద పోలీసులు దీక్షను అడ్డుకోవ‌డంతో కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందనీ, గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ ఎస్ పాలనలో ఒక్క ఉపాధ్యాయుడు, లెక్చరర్, ప్రొఫెసర్ ను కూడా నియమించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ అసమర్థత వల్లే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్నారు. 17 పరీక్షల రద్దు నిరుద్యోగులను అనిశ్చితిలోకి నెట్టివేసిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్యూన్లకు అనుగుణంగా రెండు పార్టీలు డ్యాన్స్ చేస్తున్నాయని విమ‌ర్శించారు.

click me!