కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం కథ విషాదాంతం...

Published : Sep 15, 2023, 09:52 AM IST
కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం కథ విషాదాంతం...

సారాంశం

నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన కూకట్ పల్లిలోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విగతజీవిగా దొరికాడు. విశాఖ బీచ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఈ నెల 10వ తేదీన అదృశ్యమయ్యాడు. కుటుంబకలహాల నేపథ్యంలో అతను ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అతని బ్యాంక్ అకౌంట్ నుంచి వారం రోజుల వ్యవధిలో రూ.కోటి ట్రాన్షాక్షన్స్ జరిగినట్టుగా గుర్తించారు. 

దీంతో వెంటనే కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. శ్రీధర్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు కిడ్నాప్, మిస్సింగ్ అనే కోణంలో దర్యాప్తు చేశారు. చివరికి అతనిమృతదేహం విశాఖ బీచ్ లో లభించింది. శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం.. వారంలో రూ. కోటి ట్రాన్సాక్షన్...

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?