కాంగ్రెస్‌లో విలీనంపై తేల్చేసిన కోదండరామ్

Published : Jul 09, 2021, 03:11 PM IST
కాంగ్రెస్‌లో విలీనంపై తేల్చేసిన కోదండరామ్

సారాంశం

కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనంపై జరుగుతున్న ప్రచారంపై కోదండరామ్ తేల్చేశారు. ఈ విషయమై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామన్నారు.


హైదరాబాద్: హుజూరాబాద్  అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ చెప్పారు.శెుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు జేఎసీ గా ఏర్పడాలని గతంలో తన వద్ద రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.కానీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోమన్నారు. 

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా  పేరు ప్రకటించిన తర్వాత టీజేఎస్  కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.ఈ ప్రచారాన్ని కోదండరామ్ కొట్టిపారేశారు. ఇందులో వాస్తవం లేదన్నారు.  తెలంగాణ నీటిని అక్రమంగా తీసుకెళ్తున్న జగన్ ను షర్మిల ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు. టీజేఎస్ చీప్ కోదండరామ్ 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేసి


 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !