కూతుర్ని రోకలిబండతో కొట్టి చంపిన తల్లి.. కేసులో కొత్త కోణం...

Published : Jul 09, 2021, 03:07 PM IST
కూతుర్ని రోకలిబండతో కొట్టి చంపిన తల్లి.. కేసులో కొత్త కోణం...

సారాంశం

భూక్య తిరుపతి, మమత దంపతుల పెద్ద కూతురు భూక్య సోని (09) వంట చేసేందుకు ఇంట్లో బియ్యం తీస్తున్న క్రమంలో కోపోద్రిక్తురాలైన తల్లి రోకటిబండతో కూతురి తలమీద బలంగా కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిందన్నారు. 

హుస్నాబాద్ : తల్లికి మతిస్థిమితం సరిగా లేకనే కూతుర్ని రోకలిబండతో కొట్టి చంపిందని అడిషనల్ ఎస్పీ సందేపోగు మహేందర్ అన్నారు. అక్కన్నపేట మండలం మల్ చెర్వుతండాలో తొమ్మిదేళ్ల కూతురుని కన్నతల్లే దారుణంగా కడతేర్చిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో గురువారం హుస్నాబాద్ లోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తల్లి మమత అలియాస్ రాణిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన వివరాలు వెల్లడించారు. 

భూక్య తిరుపతి, మమత దంపతుల పెద్ద కూతురు భూక్య సోని (09) వంట చేసేందుకు ఇంట్లో బియ్యం తీస్తున్న క్రమంలో కోపోద్రిక్తురాలైన తల్లి రోకటిబండతో కూతురి తలమీద బలంగా కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిందన్నారు. 

తల్లికి సరిగ్గా మతి స్థిమితం లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని విచారణలో తేలిందన్నారు. ఈ సమావేశంలో సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి, ఎస్సై కొత్తపల్లి రవి పాల్గొన్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్