పదవుల కోసం పెదవులు మూస్తే నాకు పదవి ఉండేది.. ఈటెల రాజేందర్

Published : Jul 09, 2021, 02:21 PM IST
పదవుల కోసం పెదవులు మూస్తే నాకు పదవి ఉండేది.. ఈటెల రాజేందర్

సారాంశం

తెలంగాణ ఉద్యమంలో తన పాత్రలేదా? ఎక్కడ తిన్నామో, ఎక్కడ పడుకున్నామో కేసీఆర్ కు తెలియదా? అన్నారు. కరీంనగర్ మంత్రి జైలుకు వెళ్లారా? లేక తాను జైలుకు పోయానా? సీఎంకు తెలియదా? అన్నారు. 

కరీంనగర్ : బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 యేళ్లుగా కుడిభుజంగా ఉన్న తాను అర్థగంటలోనే ఎలా దయ్యాన్నయానని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమంలో తన పాత్రలేదా? ఎక్కడ తిన్నామో, ఎక్కడ పడుకున్నామో కేసీఆర్ కు తెలియదా? అన్నారు. కరీంనగర్ మంత్రి జైలుకు వెళ్లారా? లేక తాను జైలుకు పోయానా? సీఎంకు తెలియదా? అన్నారు. 

అధికార పార్టీలో ఉన్నా తన ఇంటి మీద పోలీసులతో దాడి చేయించారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డ్ ఇవ్వాలని చెప్పానని అదేమన్నా తప్పా అని ప్రశ్నించారు. రేషన్ కార్డు ఇవ్వలేని మంత్రి పదవి ఎందుకని భావించానన్నారు. రైతు బంధు ఇవ్వాలని అయితే గుట్టలకు, ఉపయోగంలేని భూములకు, భూస్వాములకు ఇవ్వొద్దని చెప్పానన్నారు. పదవుల కోసం పెదవులు మూస్తే తనకు పదవి ఉండేదని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్