Huzurabad bypoll: ఈసీపై మండిపడ్డ మాణికం ఠాగూర్

By narsimha lodeFirst Published Oct 18, 2021, 5:47 PM IST
Highlights

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం సరఫరా చేస్తున్నా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ప్రశ్నించారు.

హుజూరాబాద్: Huzurabad bypollలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ  Manickam Tagore విమర్శించారు.

also read:కేసీఆర్ జాగీర్ కాదు... నీ ఆటలు ఇక ఎక్కువ రోజులు సాగవు: ఈటల వార్నింగ్

సోమవారం నాడు ఆయనKarimnagar లో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని ఈ నియోజకవర్గంలో మద్యం కూడా ఏరులైపారిందన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.Election Commission తనకు ఉన్న స్వతంత్రను కోల్పోయిందని ఆయన విమర్శించారు.హుజూరాబాద్‌లో ఇంటికో నిరుద్యోగి ఉన్నారని ఆయన చెప్పారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని Trs ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆయన కోరారు.హుజూరాబాద్ లో Bjp, Congress మధ్య పోటీ నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నెల  30వ తేదీన  హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2009 నుండి ఈ స్థానం నుండి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా వరుస విజయాలు సాధించాడు. అయితే ఈ దఫా ఆయన మాత్రం బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్ పోటీ చేస్తున్నారు.

click me!