వీఆర్ఓలను ప్రభుత్వంలో అడ్జెస్ట్ చేస్తాం: కేసీఆర్

By narsimha lodeFirst Published Oct 29, 2020, 2:09 PM IST
Highlights

వీఆర్ఓలను ప్రభుత్వంలో అడ్జెస్ట్ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

హైదరాబాద్: వీఆర్ఓలను ప్రభుత్వంలో అడ్జెస్ట్ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.

గురువారం నాడు మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత ఆయన సభలో మాట్లాడారు.వీఆర్ఓల పట్ల కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వంలో ఎక్కడ ఖాళీలు ఉంటాయో వారిని అడ్జెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. 

also read:దేశానికే ట్రెండ్ సెట్టర్: ధరణి పోర్టల్ ప్రారంభించిన కేసీఆర్

ఈ విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని సీఎం చెప్పారు. కొత్త రెవిన్యూ చట్టంలో వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు వీఆర్ఓలు గా  పనిచేసిన వారిని ప్రభుత్వంలో ఖాళీల మేరకు భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.

వీఆర్ఓల విషయంలో కొన్ని పార్టీలు, పత్రికలు ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆయన ఈ సందర్భంగా సెటైర్లు వేశారు.  వీఆర్ఓలుగా పనిచేసిన వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తోందని కేసీఆర్ చెప్పారు.

రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన  చేయడం కోసం కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.ఇందులో భాగంగానే ధరణి పోర్టల్ ను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

click me!