ఏపీ, తెలంగాణ సహా దక్షిణాదిలో పార్టీ బలోపేతంపై చర్చ: బీజేపీ నేత పురంధేశ్వరి

By narsimha lode  |  First Published Jul 3, 2022, 5:11 PM IST

ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టిని బలోపేతం చేయడంపై చర్చించినట్టుగా మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత ఆమె ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. 


హైదరాబాద్: ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు  రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించామని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి Purandeswariచెప్పారు.

BJP National Executive సమావేశాలు ముగిసిన తర్వాత Hyderabad  HICC  వద్ద ఆదివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన Jaipur  లో జరిగిన సమావేశంలో  తీసుకున్న నిర్ణయాల మేరకు తెలంగాణపై ప్రత్యేకంగా తీర్మానం చేశామన్నారు.

Latest Videos

undefined

 జైపూర్ లో జరిగిన సమావేశంలో ఏ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగితే ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని పురంధేశ్వరి గుర్తు చేశారు.  ఇందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేకంగా తీర్మానం చేసినట్టుగా పురంధేశ్వరి చెప్పారు. దేశంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై చర్చించామన్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇవాళ రాజకీయ తీర్మానాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు. రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. అమిత్ షా ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని కర్ణాటక  సీఎం  బసవరాజ్ బొమ్మై, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ బలపర్చారు.

దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా  వారసత్వ రాజకీయాలకు చెక్ పెడతామని కూడా బీజేపీ ధీమాను వ్యక్తం చేసింది. ఈ విషయమై అమిత్ షా తన ప్రసంగంలో ధీమాను వ్యక్తం చేశారు. ప్రజలంతా ఈ రెండు పార్టీలపై అసంతృప్తితో ఉన్నారన్నారు.

click me!