స్కూల్స్ ప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదు: కరోనాపై తెలంగాణ హైకోర్టు విచారణ

By narsimha lodeFirst Published Jan 28, 2022, 12:21 PM IST
Highlights

స్కూల్స్ తిరిగి తెరవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది.


హైదరాబాద్: Schools ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని Telangana High Courtకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. Corona పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు శక్రవారం నాడు విచారణ నిర్వహించింది.Sammakka జాతర ఏర్పాట్లపై  నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వారంతపు సంతలో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ నెల 31 నుండి పాఠశాలలు తెరుస్తారా అని  హైకోర్టు ఆరా తీసింది.పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.  కరోనా విచారణ సందర్భంగా ఆన్ లైన్ లో విచారణకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ Srinivasa Rao హాజరయ్యారు. 

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా నమోదైందని  తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో   77 లక్షల ఇళ్లలో సర్వే చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామన్నారు.  అంతేకాదు అనారోగ్యంగా ఉన్న వారికి కిట్స్ పంపిణీ చేశామన్నారు. అయితే ఈ కిట్స్ లో పిల్లల మెడిసిన్స్ లేవని న్యాయవాదులు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. పిల్లలకు మందులు కిట్ల రూపంలో ఇవ్వకూడదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పై పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. కరోనాపై విచారణను ఈ ఏడాది ఫిబ్రవరి 3 వ తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం నాడు 3,944 మందికి పాజిటివ్‌గా తేలింది.  97,549 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 3,944 మందికి కరోనా సోకింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 7,51,099కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,444 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 7,07,498కి చేరుకుంది. అలాగే వైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 39,520 యాక్టీవ్ కేసులు వున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.20 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. ఇవాళ్టీ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1372 మందికి పాజిటివ్‌గా తేలింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 40, భద్రాద్రి కొత్తగూడెం 101, జీహెచ్ఎంసీ 1372, జగిత్యాల 67, జనగామ 40, జయశంకర్ భూపాలపల్లి 42, గద్వాల 40, కామారెడ్డి 43, కరీంనగర్ 80, ఖమ్మం 135, మహబూబ్‌నగర్ 79, ఆసిఫాబాద్ 19, మహబూబాబాద్ 45, మంచిర్యాల 76, మెదక్ 60, మేడ్చల్ మల్కాజిగిరి 288, ములుగు 26, నాగర్ కర్నూల్ 59, నల్గగొండ 91, నారాయణపేట 12, నిర్మల్ 41, నిజామాబాద్ 105, పెద్దపల్లి 95, సిరిసిల్ల 48, రంగారెడ్డి 259, సిద్దిపేట 104, సంగారెడ్డి 120, సూర్యాపేట 66, వికారాబాద్ 56, వనపర్తి 64, వరంగల్ రూరల్ 78, హనుమకొండ 117, యాదాద్రి భువనగిరిలో 76 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

 

click me!