రైతు సర్కార్ వస్తేనే దేశంలో మార్పు: నాందేడ్‌ బహిరంగ సభలో కేసీఆర్

By narsimha lodeFirst Published Feb 5, 2023, 4:16 PM IST
Highlights


బీఆర్ఎస్ ను గెలిపిస్తే   తెలంగాణలో  అమలౌతున్న పథకాలు దేశ వ్యాప్తంగా  అమలు చేస్తామని కేసీఆర్  చెప్పారు.   దేశాన్ని సుదీర్థంగా  పాలించిన  పార్టీలే  ప్రజల కష్టాలకు కారణమని  ఆయన విమర్శించారు.

నాందేడ్: బీఆర్ఎస్ ను గెలిపిస్తే  2 ఏళ్లలో  మహరాష్ట్రలో అద్భుతాలు  చేసి చూపిస్తామని  తెలంగాణ సీఎం  కేసీఆర్  చెప్పారు. రైతు సర్కార్ వస్తేనే దేశంలో మార్పు వస్తుందని  తెలిపారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి... రైతు సర్కార్ ఏర్పడాలనే  ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం  చేశారు.  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా దళితబంధు, రైతు బంధును అమలు చేస్తామని   ఆయన హామీ ఇచ్చారు.

ఆదివారంనాడు  మహరాష్ట్రలోని నాందేడ్ లో  జరిగిన  బహిరంగసభలో   తెలంగాణ సీఎం  కేసీఆర్ పాల్గొన్నారు.  రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో  రైతులు సత్తా చాటాలని కేసీఆర్ కోరారు. అప్పుడే మహరాష్ట్ర సర్కార్  మీ ముందుకు  వస్తుందని  కేసీఆర్  తెలిపారు. 

దేశ నాయకత్వంలో మార్పు రావాలని కేసీఆర్  ఆకాంక్షను వ్యక్తం  చేశారు.  ప్రస్తుత నేతలు  మాటలకే పరిమితమౌతున్నారన్నారు.

 దేశానికి స్వాతంత్ర్యం వచ్చి  75 ఏళ్లు దాటినా కూడా  సాగు, తాగునీటితో పాటు  కరెంట్ కు  కష్టాలు వచ్చాయన్నారు.  మహరాష్ట్రలో  రైతు ఆత్మహత్యలు  పెరిగిపోయాయని  కేసీఆర్  చెప్పారు.  రైతు ఆత్మహత్యలకు  కారణం ఎవరని ఆయన  ప్రశ్నించారు.  దేశానికి అన్నం పెట్టే రైతుకి ఎందుకు ఈ కష్టం వచ్చిందని  కేసీఆర్ ప్రశ్నించారు.  దారులన్నీ మూసుకుపోయి  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని  కేసీఆర్ ఆవేదన వ్యక్తం  చేశారు. అందుకే   ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్  అనే నినాదాన్ని తమ పార్టీ తీసుకుందని కేసీఆర్ వివరించారు.  నాగలి పట్టిన చేతులు  శాసనాలు  చేయాల్సిన రోజులు వచ్చాయని  కేసీఆర్  తెలిపారు. .  భారత్  పేద దేశం  కాదన్నారు. చిత్తశుద్దితో  పనిచేస్తే  అమెరికా కంటే  బలమైన శక్తిగా  ఇండియా ఎదగనుందని  కేసీఆర్  తెలిపారు. 

ఢిల్లీలో  రైతులు  ఆందోళన చేస్తే  మోడీ ప్రభుత్వం  పట్టించుకోలేదని  కేసీఆర్ విమర్శించారు.  కేంద్ర ప్రభత్వ  ఫసల్ భీమా యోజన  ఓ బూటకమన్నారు.  కేంద్రంలో  పార్టీలు, ప్రధానులు మారినా కూడా ప్రజల జీవితాల్లో   మార్పు రాలేదని కేసీఆర్  చెప్పారు. దేశాన్ని   కాంగ్రెస్, బీజేపీలు  అధిక కాలం పాలించిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. దేశ ప్రజల పరిస్థితికి ఈ రెండు పార్టీలే  కారణమని కేసీఆర్ విమర్శించారు. అవినీతి విషయమై  కాంగ్రెస్, బీజేపీలు  పరస్పరం  విమర్శలు  చేసుకుంటున్న విషయాన్ని  కేసీఆర్ గుర్తు  చేశారు.  

భారతదేశం  మేధావుల దేశంగా  ఆయన  పేర్కొన్నారు.  ప్రజలకు సమస్యలు అర్ధమైనప్పుడే  బలవంతులమని  అనుకునే నేతల పతనం తప్పదని  కేసీఆర్  అభిప్రాయపడ్డారు. జయప్రకాష్ నారాయణ పిలుపు ఇవ్వడంతో  ఆనాడు  ప్రజలంతా  ఆయన వెంట నడిచిన విషయాన్ని   కేసీఆర్ ప్రస్తావించారు.  

మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన   మేకిన్ ఇండియా  జోకిన్  ఇండియా మారిందని కేసీఆర్  చెప్పారు. మేకిన్  ఇండియా  కార్యక్రమం పెకట్టినా  కూడా దేశంలోని  పలు రాష్ట్రాల్లో  ఇంకా  ఎందుకు  చైనా బజార్లు  కొనసాగుతున్నాయో  చెప్పాలన్నారు. 

రాష్ట్రాల మధ్య  జల వివాదాలను పరిష్కరించడం లేదని  తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు. ట్రిబ్యునళ్ల పేరుతో  ఏళ్ల తరబడి జల వివాదాలను పెండింగ్ లో  పెడుతున్నారని   కేంద్రంపై  కేసీఆర్  మండిపడ్డారు.  ట్రిబ్యునళ్ల పేరుతో  ప్రాజెక్టు కు అనుమతి ఇవ్వకుండా  తిప్పుతున్నారని చెప్పారు. చిత్తశుద్దితో  కృషి చేస్తే  ప్రతి ఎకారానికి  కూడా సాగు నీరు ఇవ్వవచ్చన్నారు..  

also read:నాందేడ్‌లో కేసీఆర్ సభ: బీఆర్ఎస్‌లో చేరిన మరాఠా నేతలు

తమ ప్రభుత్వం  తెలంగాణలో  ఏర్పాటు కాకముందు అనేక సమస్యలు ఉండేవన్నారు.. ఒక్కొక్క సమస్యను  పరిష్కరించుకుంటూ  తాము  పాలన సాగిస్తున్నట్టుగా కేసీఆర్  వివరించారు. ఇంటింటికి  మంచినీళ్లు అందిస్తున్నామన్నారు.  రైతులకు  24 గంటల పాటు విద్యుత్  అందిస్తున్నట్టుగా  కేసీఆర్  తెలిపారు.  రైతులకు  ఏడాదికి  రూ. 10 వేలు పెట్టుబడిని రైతులకు  సహయం  అందిస్తున్నామని  కేసీఆర్  వివరించారు.  ఇవన్నీ  తెలంగాణలో  సాధ్యమైనప్పుడు  మహరాష్ట్రలో  ఎందుకు  సాధ్యం కావని కేసీఆర్ ప్రశ్నించారు.మత విద్వేషాలు, హింసను రెచ్చగొట్టడం ఎన్నికల్లో   గెలవడం  కొన్ని పార్టీలకు అలవాటుగా మారిందని  కేసీఆర్  చెప్పారు.జెండా రంగులను  చూసి జనం మోసపోతున్నారన్నారు.    


 

click me!