సాత్విక్ ఆడ్మిషన్ మరో కాలేజీలో ఉన్న విషయం తెలియదు: పేరేంట్స్

By narsimha lode  |  First Published Mar 5, 2023, 1:09 PM IST

సాత్విక్  ఆడ్మిషన్ వేరే కాలేజీలో  ఉన్న విషయం తమకు తెలియదని  పేరేంట్స్ చెబుతున్నారు.  సాత్విక్  సూసైడ్  కేసులో తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.  



హైదరాబాద్: సాత్విక్ ను నార్సింగి  శ్రీచైతన్య కాలేజీలోనే చేర్పించినట్టుగా  పేరేంట్స్  చెబుతున్నారు.  సాత్విక్  ను వేరే కాలేజీలో  చేర్పించి  నార్సింగి  కాలేజీలో  చేర్పించినట్టుగా  తాము ఎందుకు  చెబుతామని  వారు ప్రశ్నిస్తున్నారు.

నార్సింగి  శ్రీచైతన్య కాలేజీలో  ఇంటర్  ఫస్టియర్  చదివే విద్యార్ధి  సాత్విక్  గత  నెల  28వ తేదీన  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై  ప్రభుత్వం  విచారణకు  కమిటీని ఏర్పాటు  చేసింది. ఈ కమిటీ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించింది. సాత్విక్ ఆడ్మిషన్ నార్సింగి  శ్రీచైతన్య కాలేజీలో  లేని విషయాన్ని విచారణ కమిటీ గుర్తించింది.  ఈ విషయమై  సాత్విక్   పేరేంట్స్  ఆదివారం నాడు  స్పందించారు.  

Latest Videos

తాము  సాత్విక్ ను  నార్సింగి శ్రీచైతన్య కాలేజీలోనే  చేర్పించినట్టుగా  చెప్పారు.  సాత్విక్ ఆడ్మిషన్ వేరే కాలేజీలో  ఉన్నట్టుగా  తమకు తెలియదని సాత్విక్  తండ్రి రాజు  చెప్పారు.  వేరే కాలేజీలో  చేర్పించి  నార్సింగి  శ్రీచైతన్య కాలేజీలో  సాత్విక్ ను  చేర్పించినట్టుగా  ఎందుకు  చెబుతామని  వారు ప్రశ్నిస్తున్నారు.   సాత్విక్ ను  శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యమే  హత్య చేసిందని  వారు  ఆరోపిస్తున్నారు.  సాత్విక్ ఆత్మహత్య  విషయంలో  తమకు  న్యాయం చేయాలని పేరేంట్స్  కోరుతున్నారు.సాత్విక్ ఆత్మహత్య కేసులో తమకు న్యాయం చేస్తామని పోలీసులు హమీ  ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. సాత్విక్ మృతదేహం  ఉస్మానియా  ఆసుపత్రిలో  ఉంచితే  గాంధీ ఆసుపత్రిలో  ఉంచినట్టుగా  విచారణ కమిటీలో  పేర్కొనడాన్ని  పేరేంట్స్  తప్పుబడుతున్నారు. విచారణ కమిటీ   విచారణ ఈ ఒక్క అంశంతో  తేటతెల్లమౌతుందని  వారు  విమర్శిస్తున్నారు.

సాత్విక్ ను  కాలేజీ  సిబ్బంది వేధింపులకు గురిచేశారని  పేరేంట్స్  ఆరోపిస్తున్నారు.  ఈ కాలేజీలో  చదివే విద్యార్ధులపై  లెక్చరర్లు  ఇష్టారీతిలో  దాడులు  చేసేవారని  సాత్విక్ పేరేంట్స్  చెబుతున్నారు. గతంలో కూడా సాత్విక్  ను  లెక్చరర్లు కొట్టడంతో  15 రోజులు బెడ్ రెస్ట్  తీసుకున్నారని  పరేంట్స్  చెప్పారు. ఫస్టియర్ పరీక్షలు  పూర్తవగానే వేరే కాలేజీలో చేర్పించాలని  సాత్విక్ తండ్రి రాజు  మీడియాకు  చెప్పారు.  కానీ  సాత్విక్  ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.  

also read:నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో వేధింపులు నిజమే: సాత్విక్ ఘటనలో ప్రభుత్వానికి నివేదిక

ఆత్మహత్య  చేసుకొనే  రోజున  సాత్విక్ తో  తాను అరగంట సేపు మాట్లాడినట్టుగా  రాజు చెప్పారు. సాత్విక్ కు అవసరమై న మందులు తెచ్చినట్టుగా రాజు  గుర్తు చేసుకున్నారు. సాత్విక్ కు అవసరమైన మందులు ఇచ్చి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే  సాత్విక్ ను ఆసుపత్రిలో  చేర్పించినట్టుగా  స్నేహితుల నుండి సమాచారం వచ్చిందని  రాజు  మీడియాకు తెలిపారు.
 

click me!