రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సిఫారసు: మంత్రి గంగుల

Published : Jun 14, 2021, 09:30 PM IST
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సిఫారసు: మంత్రి గంగుల

సారాంశం

 రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రికి సిఫారసు చేసినట్టుగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.   

హైదరాబాద్: రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రికి సిఫారసు చేసినట్టుగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారంనాడు భేటీ అయింది.కొత్త రేషన్ కార్డుల ధరఖాస్తులు వివిద దశల్లో ఉన్నాయని వాటిని పరిశీలించి పది రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్.

మరణించిన వారి పేర్లను కూడ రేషన్ కార్డు నుండి తొలగించాలని  సమావేశం అభిప్రాయపడింది.స్మార్ట్ కార్డులు ఇచ్చే అంశాన్ని కూడ ప్రతిపాదిస్తున్నట్టుగా  గంగుల కమలాకర్ చెప్పారు. 1498 రేషన్ దుకాణాలు, డీలర్లు లేక ఖాళీగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసే విషయం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీలర్ల కమీషన్ పెంపు అంశంపై కూడ చర్చించినట్టుగా మంత్రి తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎం నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకొంటామని ఆయన తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే