సూర్యాపేట కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్‌బాబు విగ్రహం: పర్యవేక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి

By narsimha lodeFirst Published Jun 14, 2021, 7:51 PM IST
Highlights

సూర్యాపేట పట్టణంలోని కోర్టు  చౌరస్తాకు కల్నల్ సంతోష్‌బాబు పేరు పెట్టారు. 

సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని కోర్టు  చౌరస్తాకు కల్నల్ సంతోష్‌బాబు పేరు పెట్టారు. ఆదివారంనాడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహం సూర్యాపేటకు చేరుకొంది. రేపు కోర్టు చౌరస్తాలో సంతోష్ బాబు విగ్రహన్ని  ప్రతిష్టించనున్నారు. విగ్రహ పనులను మంత్రి జగదీష్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

2020 జూన్ మాసంలో చైనా, ఇండియా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలో  సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణించాడు.

గల్వాన్ లోయలో చైనా ఆర్మీని నిలువరించడంలో సంతోష్ బాబు సహా ఇండియన్ ఆర్మీ కీలకంగా వ్యవహరించింది. సంతోష్ బాబు కుటుంబానికి  తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని ఇచ్చింది. హైద్రాబాద్ లో  సంతోష్ కుటుంబానికి స్థలం కూడ కేటాయించింది. సంతోష్ కుటుంబసభ్యులను గత ఏడాది సీఎం కేసీఆర్ పరామర్శించారు. 


 

click me!