రక్తం అందిస్తూ ప్రాణదాతగా మారిన యువకుడు...

By team teluguFirst Published Jun 14, 2021, 7:10 PM IST
Highlights

ఎందరో ప్రాణాలను నిత్యం కాపాడుతున్న హైదరాబాద్ బ్లడ్ డోనార్స్ సంస్థకి కర్త, కర్మ, క్రియ. ఇతడి గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒక నిజ జీవిత ఘటన గురించి తెలుసుకోవాలి. 

రక్తం దొరక్క రోజూ  ఎందరో ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. మనల్ని కూడా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి రక్తం కావాలి అని అడిగే ఉంటారు. మనం ఇవ్వగలిగితే ఇస్తాము, లేదంటే మహా అయితే వాట్సాప్ స్టేటస్ పెట్టి ఊరుకుంటాము. మనం చేయగలిగింది ఇంతే, నాకు బోలెడంత పని ఉందని చాలించుకుంటాము. 

కానీ కొందరు మాత్రం అలా కాదు. ఎవరైనా రక్తం అవసరం అంటే వారికి రక్తం అందే వరకు నిద్రపోకుండా ఎందరో ప్రాణాలను కాపాడుతుంటారు. తమతో ఏమాత్రం సంబంధం లేకున్నప్పటికీ... ప్రాణాలను కాపాడాలనే ఉన్నతమైన ఆశయంతో ముందుకు సాగుతూ ప్రాణాలను కాపాడమని సంతృప్తితో ముందుకుసాగిపోతుంటారు. 

ఈ కోవలోకి చెందినవాడే బండి శ్రవణ్ కుమార్. ఈ కుర్రాడు ఎందరో ప్రాణాలను నిత్యం కాపాడుతున్న హైదరాబాద్ బ్లడ్ డోనార్స్ సంస్థకి కర్త, కర్మ, క్రియ. ఇతడి గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒక నిజ జీవిత ఘటన గురించి తెలుసుకోవాలి. 

తండ్రిని కోల్పోయిన శ్రవణ్ తన ఇంటర్మీడియట్ నుండి తండ్రి జన్మదినం నాడు రక్తదానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం అలావాటుగా పెట్టుకున్నాడు. ఇలా ఒకరోజు ఒక ఆసుపత్రిలో ఎవరికో అవసరం అని రక్తం ఇద్దాము అని వెళ్లిన శ్రవణ్ ని ఒక ఘటన కలిచివేసింది. అక్కడ ఆసుపత్రిలో డెంగీ వ్యాధితో బాధపడుతూ ప్లేట్ లెట్స్ పడిపోతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ తండ్రి వద్ద కూర్చొని ఇద్దరు కూతుళ్లు ఏడుస్తున్నారు. ప్లేట్ లెట్స్ కోసం అంతటా ట్రై చేసినా దొరకలేదు. వారొచ్చి కనిపించిన శ్రవణ్ ని అడిగారు. అప్పుడు 19 సంవత్సరాల వయసున్న ఈ యువకుడు తన వంతు ప్రయత్నం చేసినా ఆయన్ను కాపాడలేకపోయాడు. 

ఆ సంఘటనతో రక్తం దొరక్క ఎవరూ చనిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనల నుండి పుట్టిందే హైదరాబాద్ బ్లడ్ డోనార్స్ సంస్థ. సోషల్ మీడియా ప్లాట్ ఫారంల ద్వారా రక్తం అవసరం అన్న ప్రతిఒక్కరికి సమయానికి రక్తాన్ని అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నాడీ యువకుడు.

ఇంత చేస్తున్న ఈ యువకుడి వయసు ఎంతో ఉంటుందనుకోకండి. కేవలం 25 సంవత్సరాల వయసులోనే ఇంత చేస్తున్నాడు. సోషల్ మీడియాలో జంట నగరాల్లో రక్తం అవసరమైన ప్రతిఒక్కరికి సోషల్ మీడియాలో బ్లడ్ డోనార్స్ హైదరాబాద్ అనే సంస్థను ట్యాగ్ చేయడం పరిపాటిగా మారిందంటే అర్థం చేసుకోండి... ఈ సంస్థ ఎన్ని ప్రాణాలను కాపాడిందో..!

ప్లాస్మా థెరపీని ప్రభుత్వం రద్దుకి చేయక ముందు ఎందరికో అవసరమైన వారికి ప్లాస్మానులి అందించాడు. తన వద్ద దాదాపుగా 10 వేల మంది రక్తదాతల సమాచారాన్ని ఉంచుకొని అవసరం అయిన ప్రతిఒక్కరి దగ్గరకి దాతను పంపిస్తూ వారి ప్రాణాలను నిలబెడుతున్నాడు. రానున్న వర్షాకాలంలో పెరగబోయే డెంగీ కేసులను చూసి ఈ యువకుడు భయపడుతున్నాడు. డెంగీ సోకిన వ్యక్తి ప్లేట్ లెట్స్ అమాంతం రాత్రికి రాత్రి పడిపోయే ప్రమాదం ఉన్నందున ప్లేట్ లెట్స్ డోనార్స్ అత్యధిక సంఖ్యలో ముందుకు రావాలని కోరుకుంటున్నాడు. 

రోజువారీగా ఎమర్జెన్సీ రక్తం అవసరమయ్యే వారితోపాటుగా తలసీమియా తో బాధపడే చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరం ఉంటుంది. వారి ఒంట్లోని రక్తాన్ని మారిస్తే తప్ప ఆ చిన్నారులు బ్రతకరు. తలసీమియాతో బాధపడే పిల్లలకు అవసరమైన రక్తాన్ని అందించాలనే సదుద్దేశంతో సెలెబ్రిటీలను అప్రోచ్ అవుతున్నాడు.

సెలెబ్రిటీలు గనుక ముందుకు వచ్చి ఈ విషయం గురించి తెలుసుకొని ముందుకు వస్తే వారిని చూసి చాలా మంది ముందుకు వచ్చి రక్తదాతలుగా మారుతారని ఆశిస్తున్నాడు. ఇంత చేస్తున్నాకూడా ఈ యువకుడు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా.. ప్రజలు తనను అభినందించే బదులు ముందుకు వచ్చి రక్తదానం చేస్తే మరింతమంది ప్రాణాలను కాపాడేందుకు వీలవుతుందని 

click me!