అందుకే పిల్లలు వద్దనుకొన్నాం: విజయశాంతి

By narsimha lodeFirst Published Oct 2, 2018, 2:54 PM IST
Highlights

పిల్లలు ఉంటే ప్రజా సేవ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించామని సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు


హైదరాబాద్: పిల్లలు ఉంటే ప్రజా సేవ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించామని సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. స్వార్థపూరిత ఆలోచనలు కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే  పిల్లలు వద్దనుకొన్నామని ఆమె చెప్పారు. తన ఆలోచనలకు  తన భర్త కూడ పూర్తిగా మద్దతు ప్రకటించారని ఆమె తెలిపారు. పిల్లలు వద్దని పదేళ్ల క్రితమే తాము నిర్ణయించుకొన్నట్టు విజయశాంతి తెలిపారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై  ఆమె స్పందించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. డబ్బులు, పేరు తాను సంపాదించినట్టు చెప్పారు. 

పిల్లలు ఉంటే  తనకు స్వార్థం వచ్చి ఉండేదేమో... అందుకే తాను పిల్లలను వద్దనుకొన్నట్టు చెప్పారు.  ప్రజలకు సేవ చేసే క్రమంలో పిల్లలు ఉంటే  స్వార్థపూరిత ఆలోచలను వచ్చే అవకాశం ఉంటుందని భావించి తాను తన భర్త పిల్లలు వద్దనుకొన్నామని విజయశాంతి చెప్పారు.

తన తర్వాత తన ఆస్తులను ప్రజలకు  ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి  పేదలకు చదువు, ఇతర అవసరాల కోసం ట్రస్ట్ ద్వారా ఖర్చు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.  తన నగలను  ఎక్కువగా వెంకటేశ్వరస్వామి హుండీలో వేసినట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు. 

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఇప్పటికే  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌‌గాంధీకి చెప్పినట్టు ఆమె తెలిపారు. అయితే తనను పోటీ చేయాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు. కానీ, దానికి తాను అంగీకరించలేదన్నారు. 

ఎన్నికల్లో పోటీ చేస్తే  తాను ఒకే నియోజకవర్గానికి పరిమితమయ్యే అవకాశం ఉందని తాను రాహుల్‌కు వివరించినట్టు ఆమె తెలిపారు. దీనికి రాహుల్‌ కూడ అంగీకరించినట్టు ఆమె గుర్తు చేశారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలను టీఆర్ఎస్ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలను  అమలు చేయనున్నట్టు ఆమె చెప్పారు. తాము అధికారంలోకి వస్తే  ఏం చే్స్తామో మేనిఫెస్టోలో పొందుపరిస్తే ...వీటిని అమలు చేయాలంటే నాలుగైదు రాష్ట్రాల బడ్జెట్లు కావాలని  టీఆర్ఎస్ విమర్శించడాన్ని ఆమె కొట్టిపారేశారు.

దళితుడిని సీఎం చేస్తానని ఇచ్చిన హమీలని కేసీఆర్ అమలు చేశాడా అని ఆమె ప్రశ్నించారు.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు,  నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు తదితర అంశాల విషయంలో  టీఆర్ఎస్  ఇచ్చిన హమీలేమయ్యాయని ఆమె ప్రశ్నించారు. 

మావోయిస్టుల ఎజెండాను అమలు చేస్తామని హమీ ఇచ్చిన కేసీఆర్ ... తమ గ్రామానికి సమీపంలోనే శృతి, సాగర్‌లను ఎన్‌కౌంటర్ చేశారని ఆమె తెలిపారు.. ఏదైనా అంశంపై చర్చ జరగాలన్నారు. మావోయిస్టుల ఎజెండాను అమలు చేయడమంటే ఎన్ కౌంటర్ చేయడమేనా అని ఆమె ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ  రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శల్లో అర్థం లేదన్నారు. సీట్ల కేటాయింపు తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారో ఆ ప్రశ్న వేస్తే తాను సమాధానం చెబుతానన్నారు. తమ పార్టీ బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇస్తోందని విజయశాంతి చెప్పారు.

సంబంధిత వార్తలు

చిరుతో సై, శశికళను అందుకే కలిశా: విజయశాంతి

పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి

click me!