చిరుతో సై, శశికళను అందుకే కలిశా: విజయశాంతి

By narsimha lodeFirst Published Oct 2, 2018, 2:38 PM IST
Highlights

చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణలో ప్రచారం చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి


హైదరాబాద్: చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణలో ప్రచారం చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి. చిరంజీవి ఏపీ ప్రాంతానికి చెందిన వాడైనప్పటికీ... ఆయన తెలంగాణలో ప్రచారానికి వస్తే  తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఉన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున  ప్రచారం చేసేందుకు చిరంజీవి వస్తే తనకు ఎందుకు అభ్యంతరం ఉంటుందని ఆమె ప్రశ్నించారు.

తనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయమన్నారు. తనతో పాటు ఇంకా ఎవరైనా స్టార్ క్యాంపెయినర్లుగా  వస్తానంటే తాను ఆహ్వానిస్తానని ఆమె చెప్పారు.

సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి రాణించినవారు కూడ ఉన్నారని ఆమె చెప్పారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి నేతలు సినీ రంగం నుండి  రాజకీయాల్లోకి రాణించినట్టు ఆమె గుర్తు చేశారు.

రాజకీయాల్లోకి వచ్చిన  కొత్తల్లో దూకుడుగా పనిచేస్తారని.. కొంతకాలానికి దూకుడు తగ్గిపోతోందన్నారు. రాజకీయాల్లో సినిమాల్లో చేయడం సులభమన్నారు. కానీ, నిజ జీవితంలో రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. వీటన్నింటికి తట్టుకొని పోరాటం చేయాల్ని ఉంటుందన్నారు. అలా పోరాటం చేసి నిలబడితేనే రాజకీయాల్లో రాణిస్తారని విజయశాంతి చెప్పారు.

తాను కూడ చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు ఆమె చెప్పారు.  సినిమాల్లో చిరంజీవి, విజయశాంతి అగ్ర నటీ నటులుగా వెలుగొందారు. ప్రస్తుతం ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ ప్రచారం  కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనమయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేది ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి

అందుకే పిల్లలు వద్దనుకొన్నాం: విజయశాంతి

click me!