షార్ట్ కట్ లో అధికారంలోకి రావాలని....కాంగ్రెస్ కుల రాజకీయాలు: ఈటల

Published : Oct 02, 2018, 02:36 PM IST
షార్ట్ కట్ లో అధికారంలోకి రావాలని....కాంగ్రెస్ కుల రాజకీయాలు: ఈటల

సారాంశం

కాంగ్రెస్ పార్టీపై మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలైనా ఇచ్చి అధికారంలోకి రావాలని ఆరాటపడుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇస్తే అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని ఈటల అన్నారు.   

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలైనా ఇచ్చి అధికారంలోకి రావాలని ఆరాటపడుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇస్తే అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని ఈటల అన్నారు. 

అమలుకు సాధ్యంకానీ హామీలిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. షార్ట్‌ కట్‌లో అధికారంలోకి రావడం కోసం కులాల ప్రస్తావన తెస్తున్నారని ఈటల మండిపడ్డారు. కుల రాజకీయాలు చేసేవారు నిలబడరన్నారు. తమ యావ, ధ్యాస అంతా తెలంగాణ అభివృద్ధి పైనేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్