అన్నారం సరస్వతి బ్యారేజ్‌కు లీకేజీలు.. అప్రమత్తమైన అధికారులు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చోటుచేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయి.

Google News Follow Us

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చోటుచేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయి. ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగుబాటు ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా అన్నారం సరస్వతి బ్యారేజ్‌కి లీకేజీలు చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది.  అన్నారం సరస్వతి బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు ఉబికి వస్తుంది. ఈ విషయం గుర్తించిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. 

అన్నారం సరస్వతి బ్యారేజ్‌లో ప్రస్తుతం 5.71 టీఎంసీల నీరు ఉండగా.. ఒక గేటు ఎత్తి 2357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా.. అన్నారం సరస్వతి బ్యారేజ్‌ను 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు.