ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయిాయి. సాధారణం కంటే నాలుగు డిగ్రీల ఉస్ణోగ్రతలు పడిపోయాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చలికి జనం గజగజ వణికిపోతున్నారు. రానున్న రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధరణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లంబసింగి లో2, చితంతపల్లిలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రగతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ని ఆదిలాబాద్ జిల్లా రాంనగర్ లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరం బీమ్ జిల్లాలోని సిర్పూర్ (యు) లో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో 6.5 డిగ్రీలు, నిర్మల్ లో 7.9 డిగ్రీలు, మంచిర్యాలలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ లో 7.5 డిగ్రీలు, అల్మాయిపేట, సత్వార్ లో 8.8 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైద్రాబాద్ లో 11.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు కన్పిస్తుంది.
మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతవరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్ , పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. హైద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. సికింద్రాబాద్, రాజేంద్రనగర్ , కార్వాన్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి.