త్వరలో వరంగల్ రూరల్ జిల్లా పేరు మార్పు : ఎర్రబెల్లి దయాకర్ రావు

Published : Jun 19, 2021, 12:50 PM IST
త్వరలో వరంగల్ రూరల్ జిల్లా పేరు మార్పు : ఎర్రబెల్లి దయాకర్ రావు

సారాంశం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తరువాత జిల్లాల పునర్విభజన జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరంగల్.. వరంగల్, వరంగల్ రూరల్ జిల్లాలుగా ఏర్పడింది. అయితే ఇప్పుడు వరంగల్ రూరల్ జిల్లా పేరు మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. 

వరంగల్ లో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి ఈనెల 21 సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి భూమి పూజ అనంతరం కేసీఆర్ కాళోజీ హెల్త్ వర్సిటీ, కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారని పేర్కొన్నారు. 

వరంగల్ రూరల్ జిల్లా పేరును హన్మకొండగా మార్చే అవకాశం ఉందని తెలిపారు. కరోనా సమయంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారన్నారు. వ్యాక్సిన్ విసయంలో కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. 30 అంతస్తులతో ఎంజీఎం ఆస్పత్రిని నిర్మిస్తామని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ