‘వెంటనే ఇంటికి రండి.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా...’ భర్తకు ఫోన్ చేసి...

Published : Jun 19, 2021, 11:28 AM IST
‘వెంటనే ఇంటికి రండి.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా...’ భర్తకు ఫోన్ చేసి...

సారాంశం

అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య చేసుకుంది.  కార్ఖానా ప్రాంతానికి చెందిన మల్ పరాజ్ యాకయ్య పెద్దకుమార్తె రవళి (24) ప్రైవేటు ఉద్యోగి. హస్మత్ పేట అంజయ్య నగర్ ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్.. తనకన్నా ఒక సంవత్సరం చిన్నవాడైన మహేష్ ను ఈ ఏడాది ఫిబ్రవరి 26వ వివాహం చేసుకుంది.  భర్త అత్తమామలతో కలిసి హస్మత్ పేట్ లోనే ఉంటుంది.  

గురువారం భర్త మహేష్ ట్యాంక్ బండ్ వద్ద ఫోటోలు తీయడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో రవళి ’వెంటనే ఇంటికి రావాలని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని..’  భర్తకు తెలిపింది.

వెంటనే కంగారుపడిన మహేష్, ఇంటి పక్కన ఉండే శ్రావణి అనే ఆవిడకి ఫోన్ చేసి వెళ్లి చూడమని చెప్పాడు.  శ్రావణి వెళ్లి చూడగా లోపల నుంచి తలుపు లాక్ చేసి ఉంది.  దీంతో స్థానికుల సాయంతో డోరు తెరిచి, చూడగా అప్పటికే రవళి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని స్థానికులు రవళి తండ్రికి సమాచారం ఇచ్చారు. తండ్రి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !