ఆర్టిసి బస్సును ఢీకొన్న ఇసుకలారీ... 20మందికి తీవ్ర గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : Jun 19, 2021, 10:51 AM IST
ఆర్టిసి బస్సును ఢీకొన్న ఇసుకలారీ... 20మందికి తీవ్ర గాయాలు

సారాంశం

ఆర్టిసి బస్సు-ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 

వరంగల్‌:  వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.  

పరకాల ఆర్టిసి డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో భూపాలపల్లి బయలుదేరింది. బస్సు మందారిపేట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఇసుకలారీ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బస్సుతో పాటు లారీ ముందుబాగం నుజ్జునుజ్జయ్యాయి. 

read more  కొడంగల్ వద్ద రెండు కార్లు ఢీ, నుజ్జు నుజ్జు: అక్కడికక్కడే నలుగురు మృతి

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదు. లారీ డ్రైవర్ ను  అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?