మెడికో ప్రీతి మృతికి ర్యాంగింగే కారణం.. అందుకు ఎటువంటి ఆధారాలు లేవు: వరంగల్ సీపీ

By Sumanth KanukulaFirst Published Mar 20, 2023, 2:44 PM IST
Highlights

కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతుందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి  మృతికి ర్యాంగింగే  కారణమని అని అన్నారు.

కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతుందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి  మృతికి ర్యాంగింగే  కారణమని అని అన్నారు. ప్రీతి విషయంలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ర్యాగింగ్ ను‌ కాజ్ ఆఫ్ డెత్ గా నిర్ధారించామన్నారు. అయితే హత్య కోణంలో విచారించినప్పుడు.. ప్రీతి హత్యకు గురైనట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. ప్రీతి పోస్టుమార్టమ్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మహత్య విషయంలో ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్‌తో పాటు మరో ఇద్దరిపై అనుమానం ఉందన్నారు. సైఫ్ కాల్ డేటా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రీతి కేసు దర్యాప్తును ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. 

ఇక, కేఎంసీలో అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని కథనాలు వెలువడ్డాయి. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ప్రీతికి ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి  విషమిస్తుండడంతో..  అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి అక్కడి నుంచి తరలించారు.  అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం విశ్వప్రయత్నాలు చేసింది. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు ప్రీతి ఆత్మహత్యా కాదని..  హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో ఆమె బాడీలో ఎలాంటి విషపదార్థాలు లేనట్టుగా తేలింది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని ఆ రిపోర్టులో నిపుణులు పేర్కొన్నారు. దీంతో గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్‌తో స్పష్టమైంది. 

click me!