మంచిర్యాలలో విషాదం: ప్రేమ వేధింపులు భరించలేక విద్యార్ధిని ఆత్మహత్య

Published : Mar 20, 2023, 02:18 PM ISTUpdated : Mar 20, 2023, 04:15 PM IST
మంచిర్యాలలో  విషాదం: ప్రేమ వేధింపులు  భరించలేక  విద్యార్ధిని  ఆత్మహత్య

సారాంశం

మంచిర్యాల జిల్లాలోని  కొత్తమామిడి  గ్రామంలో  ప్రేమ వేధింపులు  భరించలేక  విద్యార్ధిని  ఆత్మహత్య చేసుకుంది.

మంచిర్యాల: జిల్లాలోని  దండేపల్లి మండలం  కొత్తమామిడిపల్లిలో  ప్రేమ  వేధింపులు  భరించలేక  విద్యార్ధిని  సాయిష్మా ఆత్మహత్యాయత్నం  చేసుకుంది . ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను  హైద్రాబాద్  నిమ్స్ కు తరలించారు.  నిమ్స్  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  ఆమె  మృతి చెందింది.   ఈ ఘటన  సాయిష్మా  కుటుంబంలో  విషాదాన్ని  నింపింది.

ఈ నెల  18వ తేదీన  సాయంత్రం  సాయిష్మా  అనే విద్యార్ధిని  పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నం  చేసింది.  తనకు  వేరే వ్యక్తితో  నిశ్చితార్ధం  జరిగినా  కూడా  ప్రేమ పేరుతో  వినయ్ కుమార్ అనే  యువకుడు  వేధింపులకు పాల్పడినట్టుగా  ఆమె  ఆరోపించింది.తనను ప్రేమించి  పెళ్లి  చేసుకోకపోతే  అంతు చూస్తానని  వినయ్ కుమార్  వేధించాడని  ఆమె  ఆరోపించారు.  వినయ్ కుమార్  పురుగుల మందు తాగాలని కోరితేనే తాను తాగినట్టుగా  ఆసుపత్రిలో  చికిత్స సమయంలో  సాయిష్మా  మీడియాకు  చెప్పారు.  

సాయిష్మా  పురుగుల మందు తాగిన  విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు  కరీంనగర్ ప్రైవేట్  ఆసుపత్రిలో  తొలుత చికిత్స అందించారు.  అక్కడి నుండి  మెరుగైన చికిత్స కోసం  హైద్రాబాద్ నిమ్స్ కు తరలించారు. హైద్రాబాద్  నిమ్స్ లో  చికిత్స పొందుతూ  సాయిష్మ  మృతి చెందిందని  పేరేంట్స్  చెప్పారు.  తమ కూతురు మృతికి  వినయ్ కుమార్  వేధింపులే కారణమని సాయిష్మ  పేరేంట్స్  ఆరోపిస్తున్నారు.  వినయ్ కుమార్ ను  కఠినంగా  శిక్షించాలని  మృతురాలి  పేరేంట్స్  కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే