9నెలల పసికందుపై అత్యాచారం,హత్య కేసు: మరణశిక్ష విధించిన వరంగల్ కోర్టు

By Nagaraju penumala  |  First Published Aug 8, 2019, 1:35 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారం, ఆపై హత్య కేసులో వరంగల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, ఆపై హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 
 


వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారం, ఆపై హత్య కేసులో వరంగల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, ఆపై హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. 

ఇకపోతే ఈ కేసులో ప్రవీణ్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించడంతో అతడికి మరణశిక్ష విధించింది. ఈ ఏడాది జూన్ 19న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ లోని పాలచందాలో 9 నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. 

Latest Videos

హత్య చేసి పరారవుతుండగా ప్రవీణ్ ను పట్టుకుని స్థానికులు చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. అనంతరం వరంగల్ కోర్టు ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది. విచారణ చేపట్టిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు ప్రవీణ్ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించింది. 

48 రోజులపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 30 మందిని విచారించింది. విచారణ అనంతరం ప్రవీణ్ నిందితుడిగా తేల్చింది. ఈ నేపథ్యంలో వరంగల్ కోర్టు నిందితుడికి మరణ శిక్ష ఖరారు చేసింది.  ప్రవీణ్ కు 302 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో అతడికి మరణ శిక్ష విధించింది.  

ఇకపోతే చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అయిన ప్రవీణ్ జూన్ 18న డాబాపై తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ కు మరణశిక్షకు విధించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

click me!