తెలంగాణ గవర్నర్ పదవి.. ఆఫర్ వదులుకున్న సుష్మా స్వరాజ్

By telugu teamFirst Published Aug 8, 2019, 12:29 PM IST
Highlights

మంగళవారం రాత్రి గుండె పోటు కారణంగా సుష్మా స్వరాజ్ హఠాన్మరణం పొందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే.. ఇటీవల ఆమెకు తెలంగాణ గవర్నర్ పదవిని అధిష్టానం ఆఫర్ చేసిందంట.
 
కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతగానో కృషి చేశారు. ఈ విషయం అందరిదకీ తెలిసిందే. కాగా... అలాంటి ఆమెకు బీజేపీ అధిష్టానం... తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవిని కేటాయిద్దామని అనుకున్నారు. కానీ... ఆ  పదవిని ఆమె తిరస్కరించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మంగళవారం రాత్రి గుండె పోటు కారణంగా సుష్మా స్వరాజ్ హఠాన్మరణం పొందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే.. ఇటీవల ఆమెకు తెలంగాణ గవర్నర్ పదవిని అధిష్టానం ఆఫర్ చేసిందంట.

అయితే... తన అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆమె ఆ పదవిని తిరస్కరించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమె పార్లమెంట్ లో తన గళాన్ని గట్టిగా వినిపించారు. అప్పటి నుంచే ఆమెను అందరూ చిన్నమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ అమ్మ అయితే... నేను మీకు చిన్నమ్మను నన్ను మర్చిపోకండి అంటూ ఆమె 2014 ఎన్నికల్లో పబ్లిక్ మీటింగ్స్ లో స్వయంగా పేర్కొన్నారు.

రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుష్మాని తెలంగాణ గవర్నర్ గా నియమించాలని చాలా లమంది తెలంగాణ నేతలు కోరినట్లు సమాచారం. కానీ వారి కోరికను ఆమె సున్నితంగా తిరస్కరించారని ఇప్పుడు బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

click me!