మంత్రి హరీష్ తో కాంగ్రెస్ మాజీ ఎంపీ మంతనాలు... టీఆర్ఎస్ లో చేరిక ఖాయమేనా?

By Arun Kumar PFirst Published Oct 15, 2021, 7:50 AM IST
Highlights

టిపిసిసి చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంచి జోరుమీదున్న టికాంగ్రెస్ కు షాకిచ్చేందుకు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మంత్రి హరీష్ రావుతో మంతనాలు జరిపినట్లు... త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

సిద్దిపేట: తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి వచ్చినప్పటి నుండి ఆ పార్టీలో జోష్ పెరిగింది. వరుస కార్యక్రమాలతో కోల్పోయిన తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే  ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన టీఆర్ఎస్ మరోసారి ఆ పార్టీని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు టీఆర్ఎస్ కండువా కప్పి తెలంగాణ కాంగ్రెస్ కు షాకివ్వాలని టీఆర్ఎస్ భావిస్తోందట. 

కాంగ్రెస్ మాజీ ఎంపీ siricilla rajaiah హటాత్తుగా సిద్దిపేటలో ప్రత్యక్షమవడంతో ఆయన పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజయ్య మంత్రి harish rao తో కూడా మంతనాలు జరిపినట్లు... ఇక TRS లో చేరడం లాంఛనమేనని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. సిరిసిల్ల రాజయ్య పార్టీ మార్పు ప్రచారంపై అటు TPCC గానీ ఇటు టీఆర్ఎస్ గానీ స్పందించలేదు. కానీ తాజాగా ఆయన మంత్రి హరీష్ రావును, సిద్దిపేట అభివృద్దిని పొగుడుతూ చేసిన కామెంట్స్ పార్టీ మార్పు ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.

వీడియో

siddipet లోని కోమటిచెరువు వద్ద లేజర్ లైట్ అండ్ మ్యూజికల్ ఫౌంటెన్ షో ఏర్పాటుచేసారు. దీన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ అద్భుత జలదృశ్యాన్ని వీక్షించేందుకు ప్రజలు కోమటిచెరువు బాటల పట్టారు. ఇలా కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ గా పిలుచుకునే కోమటిచెరువు వద్ద ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా అక్కడే వున్న ఆర్థిక మంత్రి హరీష్ కు ఆయనకు ఆసక్తికర సంబాషణ సాగింది. 

video  బతుకమ్మ స్పెషల్... సరికొత్త అందాలతో మెరిసిపోతున్న కోమటిచెరువు  
 
కోమటిచెరువు అందాలను చూసి తానునూ సిద్దిపేటలో ఉన్నానా లేక మరే ఇతర దేశాలంలో ఉన్నానా? అని అనుమానం కలుగుతోంది రాజయ్య మంత్రి హరీశ్ రావుతో అన్నారు. ఈ సందర్భంగా ఎట్లుందే సిద్దిపేట కోమటి చెరువు అని హరీష్ రావు అడగ్గా మస్తుందే... చాలా అభివృద్ధి చేశారు అన్న అని రాజయ్య కొనియాడారు. పక్కన ఉన్న నాయకునితో దగ్గర ఉండి రాజన్నకు కోమటి చెరువు మొత్తం చూపెట్టాలని మంత్రి హరీష్ రావు సూచించారు. 

సిద్దిపేటనే కాదు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలో నెంబర్ వన్ గా చేశారన్న అంటూ రాజయ్య ప్రశంసించారు. ఇలా టీఆర్ఎస్ పాలనను పొగుడుతూ రాజయ్య కామెంట్స్ చేయడం గులాబీ గూటికి చేరడానికేనని... త్వరలో ఆయన గులాబీ కండువా కప్పుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ కాంగ్రెస్ పార్టీనే కాదు బిజెపి ని కూడా ఇరకాటంలో పెట్టారు రాజయ్య. హుజురాబాద్ పరిధిలోని జమ్మికుంట మున్సిపాలిటి ఇంచార్జిగా వున్నరాజయ్య ఉపఎన్నికలో పార్టీకి నష్టం చేసేలా చేసిన వ్యాఖ్యలపై టిపిసిసి చీఫ్ రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి. 
 

click me!