దసరా శోభ.. సొంతూరికి హైదరాబాదీలు: హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం

By Siva KodatiFirst Published Oct 14, 2021, 10:15 PM IST
Highlights

దసరా (dussehra ) పండుగ కావడంతో హైదరాబాదీలు సొంతూళ్లకి పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ (hyderabad vijayawada highway) జాతీయ రహదారిపై గురువారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

దసరా (dussehra ) పండుగ కావడంతో హైదరాబాదీలు సొంతూళ్లకి పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ (hyderabad vijayawada highway) జాతీయ రహదారిపై గురువారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పండక్కి ఉదయం నుంచే పల్లెబాట పట్టడంతో హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. సాయంత్రం అంతా విధులు ముగించుకుని సొంత వాహనాల్లో పల్లెబాట పట్టడంతో రద్దీ మరింత పెరిగింది. 

హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ప్రయాణికులు కొయ్యలగూడెంలోని (koyyalagudem) గణపతి దేవాయలం వద్దకు వచ్చే సరికి ముందు వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్‌ (choutuppal) నుంచి కొయ్యలగూడెం వరకు ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చౌటుప్పల్‌ నుంచి నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు గంట సమయం పట్టిందంటే పరిస్ధితి అర్థం చేసుకోవచ్చు. చౌటుప్పల్‌ వద్ద  అండర్‌పాస్‌ వంతెన లేకపోవడంతో పండుగల వేళ, వారాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. పంతంగి టోల్‌ ప్లాజా (panthangi toll plaza) వద్ద ఫాస్టాగ్‌ (fastag) విధానం అమలు చేయడంతో అక్కడ ఎలాంటి ట్రాఫిక్ లేదు. 

ALso Read:Navratri 2021: శరన్నవరాత్రులు.. అమ్మవారి తొమ్మిది రూపాలు.. ప్రత్యేక విశేషాలు!

కాగా, ప్రతి యేడు లాగానే ఈ సంవత్సరం కూడా స్పెషల్ బస్సుల పేరుతో స్పెషల్ ఛార్జీలు వసులు చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ (apsrtc). దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు (dwaraka tirumala rao) వెల్లడించారు.

అయితే స్పెషల్ బస్సుల్లో స్పెషల్ ఛార్జీలు (special charges) వసూలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఓ వైపు బస్సు ఖాళీగా వెళ్తుందని.. కాబట్టి స్పెషల్ బస్సుల్లో 50 శాతం పెంచుతున్నామని  తెలిపారు. రెగ్యులర్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని..  వాటిలో సాధారణ ఛార్జ్ లే ఉంటాయన్నారు. దసరా సందర్భంగా 4 వేల ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ నుంచే 18 వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుస్తాయన్నారు.

ఆన్‌లైన్‌లో రెగ్యులర్ సర్వీస్‌ల టిక్కెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలను దోచుకోవాలని ఆర్టీసీ భావించదని.. మనుగడ కోసమే చార్జీల పెంపు అని వివరణ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నానని ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు, ఇతర బెనిఫిట్స్‌పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. ఆర్ధిక ఇబ్బందులు అధిగమించడానికి కార్గో సేవలను విస్తృత పరిచామన్నారు. మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పెరిగిన డీజిల్ రేట్లు సంస్థపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఇప్పటి వరకు ప్రయాణికుల నుంచి పెద్దగా డిమాండ్ కనపడటంలేదని.. అయితే తాము మాత్రం ఏర్పాట్లు చేస్తున్నామని ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.

click me!