వాడివేడిగా హెచ్‌సీఏ సమావేశం: ప్రతిదానికీ అడ్డుపడుతున్నారు.. అజారుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 11, 2021, 4:26 PM IST
Highlights

హైదరాబాద్‌లో క్రికెట్ అభివృద్ధికి 20 శాతం ఫండ్ కేటాయించామని తెలిపారు హెచ్‌సీఏ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌ . తెలంగాణలోని అన్ని జిల్లాలో గ్రౌండ్‌లు ఏర్పాటు చేస్తామన్నామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో క్రికెట్ అభివృద్ధికి 20 శాతం ఫండ్ కేటాయించామని తెలిపారు హెచ్‌సీఏ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌ . తెలంగాణలోని అన్ని జిల్లాలో గ్రౌండ్‌లు ఏర్పాటు చేస్తామన్నామని స్పష్టం చేశారు.

పలువురు తమ స్వలాభం కోసం, తానేమి చేస్తున్నా అడ్డుపడాలని చూస్తున్నారని ఆరోపించారు. హెచ్‌సీఏలో వివాదాలపై బీసీసీఐ సీరియస్‌గా ఉందని అజారుద్దీన్ తెలిపారు. ఏజీఎంలో వివాదం సృష్టించిన వారికి షోకాజ్ నోటీస్‌లు ఇవ్వడంతో పాటు అవసరమైతే సస్పెండ్ చేస్తామని అజారుద్దీన్‌ హెచ్చరించారు.

Also Read:అవినీతితో తెలంగాణలో క్రికెట్‌ను చంపేస్తున్నారు... అజారుద్దీన్‌పై టీసీఏ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ ఫైర్...

కాగా, ఆదివారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘం సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. జస్టిస్ దీపక్ వర్మను హెచ్ సీఏ అంబుడ్స్ మన్ గా నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నియామకంపై గతంలో ఓసారి హెచ్ సీఏ సమావేశం వాయిదా పడింది. అప్పుడు స్టేజీపైనా వాగ్బాణాలు సంధించుకున్నారు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్.

అయితే ఇవాళ్టి సమావేశంలోనూ అదే సీన్ రిపీట్ చేశారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. చివరికి ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్యే సర్వసభ్య సమావేశం ముగిసింది.

click me!