ఇక నుండి మాస్కులు ధరించకపోతే రూ. 1000 ఫైన్: తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

By narsimha lodeFirst Published Apr 11, 2021, 3:48 PM IST
Highlights

రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ. 1000 జరిమానా విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆదివారంనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.


హైదరాబాద్: రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ. 1000 జరిమానా విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆదివారంనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. గతంలో కూడ కరోనా కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో ఇదే పద్దతిలో మాస్కులు ధరించకపోతే రూ. 1000 జరిమానా విధించిన విషయం తెలిసిందే.

బహింగర ప్రదేశాల్లో, పనిచేసే ప్రదేశాల్లో  మాస్కులు ధరించాలని ఆ ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుండి రూ. 1000 ఫైన్ వసూలు చేయనున్నారు.
ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసులకు జరిమానాను విధించే అధికారాన్ని సీఎస్ కట్టబెట్టారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. మహారాష్ట్రకు తెలంగాణ సరిహద్దు ఉండడం కూడ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.సెకండ్ వేవ్ తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉందని మరో నాలుగు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు. కేసుల సంఖ్య ఇలానే పెరిగిపోతే రాష్ట్రంలో రోగులకు కనీసం బెడ్స్ కూడా దొరకని పరిస్థితి కూడ ఉండే  దొరకకపోయే అవకాశం ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించే అవకాశాలు మెండుగా ఉంటాయి.
 

click me!