రెమ్‌డిసివర్ చిచ్చు: సిఫారసు పట్టించుకోలేదని జోగు రామన్న ఆగ్రహం, రిమ్స్ డైరెక్టర్‌పై ప్రతాపం

By Siva KodatiFirst Published Apr 25, 2021, 3:49 PM IST
Highlights

ఆదిలాబాద్‌లో కరోనా నియంత్రణపై జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కరోనా బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందని విషయాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న లేవనెత్తగా దానికి రిమ్స్ డైరెక్టర్ కౌంటరిచ్చారు

ఆదిలాబాద్‌లో కరోనా నియంత్రణపై జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కరోనా బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందని విషయాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న లేవనెత్తగా దానికి రిమ్స్ డైరెక్టర్ కౌంటరిచ్చారు.

ఎమ్మెల్యే చెప్పినవారికి రెమ్‌డిసివర్, ఆక్సిజన్ ఇవ్వనందుకే ఎమ్మెల్యే, రిమ్స్ వైద్యులు తనను టార్గెట్ చేస్తున్నారంటూ డైరెక్టర్ ఆరోపించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నానని తన పని తనను చేసుకోనివ్వండని రిమ్స్ డైరెక్టర్ బలరామ్ నాయక్ అన్నారు. ఆయన మాటలకు అంతా షాక్ అయ్యారు. 

Also Read:తెలంగాణలో కరోనా ఉధృతి: 24 గంటల్లో 8,126 కేసులు, 38 మంది మృతి

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం రాజకీయ పైరవీలు ఎక్కువయ్యాయని రిమ్స్ డైరెక్టర్ ఆరోపించారు. ఇంజెక్షన్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే జోగు రామన్న తనపై కక్ష కట్టారని, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు ఎక్కడ తరలిపోయాయో ఆధారాలు చూపించాలని బలరాం నాయక్ సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం తాను ఎవరికీ రికమెండ్ చేయలేదని స్పష్టం చేశారు. 

కాగా, కరోనా చికిత్సలో రెమ్‌డిసివర్ మంచి ఫలితాలను ఇస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఔషదం ఎగుమతులపై నిషేధం విధించింది. అధికారులు ఎప్పటికప్పుడు రెమ్‌డెసివర్ నిల్వలను తనిఖీ చేయాలని సూచించిన సంగతి తెలిసిందే.

click me!