ఏప్రిల్ 27 నుండి తెలంగాణలో వేసవి సెలవులు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

By narsimha lodeFirst Published Apr 25, 2021, 2:42 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు  సెలవులు ప్రకటిస్తున్నట్టుగా  తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు  సెలవులు ప్రకటిస్తున్నట్టుగా  తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వేసవి సెలవులపై  సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్టుగా చెప్పారు. కరోనా నేపథ్యంలో  సీఎం ఆదేశాల మేరకు  1వ తరగతి నుండి 9వతరగతి విద్యార్ధులను ప్రమోట్ చేసినట్టుగా మంత్రి తెలిపారు. ఇప్పటికే టెన్త్ పరీక్షలను రద్దు  చేశామన్నారు. 

1వతరగతి నుండి 9వతరగతులకు చెందిన 53.79 లక్షల మంది విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు తెరిచే విషయమై జూన్ 1న ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని  మంత్రి ప్రకటించారు.  ఏప్రిల్ 26ను  ప్రభుత్వం నిర్ణయిస్తోందని చెప్పారు. 

తెలంగాణలో  ఈ ఏ)డాది మార్చి 24వ తేదీ నుండి విద్యా సంస్థలకు తాత్కాలికంగా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం., కరోనా నేపథ్యంలో గత ఏడాది కూడ టెన్త్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్ధులను ప్రమోట్ చేసింది. 


 

click me!