డిసెంబర్ 28 నుంచి జనవరి 24 వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసి, థర్డ్ ఏసిలతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
సికింద్రాబాద్ : సంక్రాంతి అంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎక్కడ చూసినా రద్దీలేని రోడ్లే కనిపిస్తాయి. పండగకు ఊర్లకు వెళ్లేవారితో ట్రైన్లు, బస్సులు బిజీగా మారిపోతాయి. టికెట్లు దొరకక ఇబ్బందులు పడి.. చివరి నిమిషాల్లో ప్రయాణం క్యాన్సిల్ చేసుకునేవారు ఎంతోమంది. ఇలాంటి అవస్థలు తప్పించడానికి.. తెలుగు రాష్ట్రాల్లో ఒకదగ్గరినుంచి మరో దగ్గరికి పండగపూట ప్రయాణం చేయడం సులభం చేయడం కోసం దక్షిణ మధ్య రైల్వే తెలుగు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వారి కోసం వివిధ మార్గాల్లో 20 ప్రత్యేక రైళ్లు వేస్తున్నట్లుగా తెలిపింది. ఈ రైళ్లు అన్నీ హైదరాబాద్-తిరుపతి , కాచిగూడ- కాకినాడ టౌన్ హైదరాబాద్ తిరుపతి రూట్ లలో నడుస్తాయి.
డిసెంబర్ 28 నుంచి జనవరి 24 వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసి, థర్డ్ ఏసిలతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలు తెలిపింది.
దీనికి సంబంధించిన రైళ్ల వివరాలను ఈ మేరకు తెలిపారు..
కాచిగూడ - కాకినాడ టౌన్
ట్రైన్ నెంబర్ 07653 కాచిగూడ నుంచి కాకినాడ టౌన్ కి వెళ్లే రైలు గురువారం రాత్రి 8.30 బయలుదేరుతుంది. తెల్లవారి అంటే శుక్రవారం ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ డిసెంబర్ 28, జనవరి 4, జనవరి 11, జనవరి 18, జనవరి 25 తేదీల్లో నడుస్తుంది.
కాకినాడ టౌన్ టు కాచిగూడ
ట్రైన్ నెంబర్ 07654 కాకినాడ టౌన్ నుంచి కాచిగూడ కు వచ్చే రైలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 10 నిమిషాలకి కాకినాడ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు అంటే శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ డిసెంబర్ 29, జనవరి 5, జనవరి 12, జనవరి 19, జనవరి 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్ టు తిరుపతి
ఇక హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ట్రైన్ నెంబర్ 07509.. గురువారం రాత్రి 7 గంటల 25 నిమిషాలకు హైదరాబాదు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం అంటే శుక్రవారం ఉదయం 8.30 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ హైదరాబాద్ టు తిరుపతి ట్రైన్ డిసెంబర్ 29వ తేదీ, జనవరి 4, జనవరి 11, జనవరి 18, జనవరి 25 తేదీల్లో ఉంటుంది.
భట్టి వ్యాఖ్యలపై నిరుద్యోగ జేఏసీ ఆగ్రహం.. కాంగ్రెస్ మేనిఫెస్టోను దహనం చేసి ఆందోళన
తిరుపతి టు హైదరాబాద్
ట్రైన్ నెంబర్ 07509 తిరుపతి నుంచి హైదరాబాదుకు వచ్చే స్పెషల్ ట్రైన్ శుక్రవారం రాత్రి 8:15 నిమిషాలకు బయలుదేరుతుంది. అది శనివారం ఉదయం 8:40 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా డిసెంబర్ 29, జనవరి 5, జనవరి 12, జనవరి 19, జనవరి 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.
కాచిగూడ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి కాచిగూడకు ప్రయాణించే ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ ,ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయి.
అలాగే.. హైదరాబాదు నుంచి తిరుపతికి.. తిరుపతి నుంచి హైదరాబాదుకు నడిచే ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల స్టేషన్ల మీదుగా వెళతాయి.