
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. వీఆర్ఏతో ఉన్నతాధికారులు ఆర్డీవో కార్యాలయాన్ని ఊడిపించి శుభ్రం చేయించారు. వివరాలు.. వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో అటెంటర్ లేకపోవడంతో.. రోజూ కార్యాలయం శుభ్రం చేయాలంటూ వీఆర్ ప్రశాంత్‌ను ఉన్నతాధికారులు ఆదేశించారు. విధిలేని పరిస్థితుల్లో రోజూ ఆఫీస్ శుభ్రం చేస్తున్నానని వీఆర్ఏ ప్రశాంత్ చెప్పాడు.
వీఆర్ఏ ప్రశాంత్ ఆర్డీఏ కార్యాలయం ఆవరణలో చీపురు పట్టి ఊడ్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఉన్నతాధికారులు మాత్రం తాము కార్యాలయాన్నిశుభ్రం చేయాలని వీఆర్‌ఏకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలదని చెప్పుకొస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.