ఆమ్‌వేకి ఈడీ షాక్: రూ.757 కోట్ల ఆస్తుల సీజ్

Published : Apr 18, 2022, 04:35 PM ISTUpdated : Apr 18, 2022, 04:48 PM IST
ఆమ్‌వేకి ఈడీ షాక్: రూ.757 కోట్ల ఆస్తుల సీజ్

సారాంశం

మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ ఆమ్ వేకి ఈడీ  సోమవారం నాడు షాకిచ్చింది. రూ.757 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఆమ్ వే సంస్థ  మనీ లాండరింగ్ కు పాల్పడిందని ఈడీ గుర్తించింది.

న్యూఢిల్లీ: మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ ఆమ్‌వే కు ఈడీ సాకిచ్చింది.  ఆమ్‌వే సంస్థకు చెందిన రూ. 757 కోట్లను ఈడీ సోమవారం నాడు సీజ్ చేసింది. 

Amway ఆస్తులతో పాటు, ఫ్యాక్టరీలోకు సంబంధించిన స్థలాలను కూడా Enforcement Directorate  సీజ్ చేసింది. రూ.411 కోట్ల ఆస్తులు, రూ. 345 కోట్ల Bank Balance  బాలెన్స్ ప్రీజ్ చేశారు.  దేశ వ్యాప్తంగా ఉన్న 36 బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.ఆమ్ వే సంస్థ ఇప్పటివరకు రూ. 27,562 కోట్ల వ్యాపారం చేసినట్టుగా  ఈడీ గుర్తించింది.  కమిషన్ రూపంలో రూ.7,588 ఆమ్ వే సంస్థ చెల్లించినట్టుగా ఈడీ తెలిపింది.  అమెరికాకు చెందిన బ్రిట్ వరల్డ్ వైడ్ నెట్ వర్క్ 21లో అమ్ వే షేర్లు పెట్టినట్టుగా ఈడీ గుర్తించింది.

Tamilnadu  రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని ఫ్యాక్టరీ స్థలంతో పాటు ఫ్యాక్టరీలో ఉన్న మిసనరీ, వాహనాలను కూడా సీజ్ చేసినట్టుగా ఈడీ వివరించింది.  మల్టీలెవల్ మార్కెటింగ్ నెట్ వర్క్ ముసుగులో  ఆమ్ వే సంస్థ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్టుగా ఈడీ గుర్తించింది.  ఆమ్ వే సరఫరా చేసే ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులతో పోలిస్తే అధిక ధరలున్నట్టుగా తాము గుర్తించామని ఈడీ ప్రకటించింది.

2002-03 నుండి 2021-22 వరకు కంపెనీ  రూ.27,562 కోట్ల వ్యాపారం చేసిందని ఈడీ తెలిపింది. అసలు వాస్తవాలు తెలియకుండాన సామాన్య ప్రజలు ఈ సంస్థలో సభ్యులుగా చేరి మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు వస్తువులను కొనుగోలు చేస్తున్నారని ఈడీ వివరించింది.

ఆమ్ వే 1996-97 లో భారతదేశంలో రూ. 21.39 కోట్లను షేర్ కాపిటల్ గా ఇండియాకు తీసుకు వచ్చింది. 2020-21 ఆర్ధిక సంవత్సరం వరకు ఆమ్ వే కంపెనీ తన పెట్టుబడిని మాతృ సంస్థలకు డివిడెండ్ రాయల్టీ ద్వారా చెల్లించినట్టుగా ఈడీ గుర్తించింది. రూ. 2,859.10 కోట్లను మాతృ సంస్థలకు ఆమ్ వే రాయల్టీ, డివిడెండ్ల రూపంలో చెల్లించినట్టుగా ఈడీ వివరించింది.ఆమ్ వే సంస్థ సీఈఓను కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.. తెలుగు రాష్ట్రాల్లో ఆమ్ వే పై నమోదైన కేసులకు సంబంధించి సీఐడీ దర్యాప్తు చేసింది.

PREV
click me!

Recommended Stories

Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా