
న్యూఢిల్లీ: మాజీ ఎంపీ వివేక్ శుక్రవారం నాడు బీజేపీలో చేరారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.శుక్రవారం నాడు ఉదయం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి ఆయన న్యూఢిల్లీకి వెళ్లారు.
న్యూఢిల్లీలో రాం మాధవ్‌తో తొలుత వివేక్ సమావేశమయ్యారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వివేక్ భేటీ అయ్యారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలతో వివేక్ సమావేశమయ్యారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి వివేక్ అమిత్ షాతో భేటీ అయ్యారు.అమిత్ షా సమక్షంలో వివేక్ బీజేపీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పెద్దపల్లి నుండి టీఆర్ఎస్ టిక్కెట్టు ఆశించాడు. కానీ, కేసీఆర్ ఆయనకు టిక్కెట్టు కేటాయించలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకొన్నాడు.
సంబంధిత వార్తలు
తెలంగాణ కాంగ్రెసుకు షాక్: బిజెపిలోకి వివేక్