మవోయిస్టు అగ్రనేతలతో కాశీంకు లింక్స్: భార్యపైనా కేసు

By telugu teamFirst Published Jan 22, 2020, 6:17 PM IST
Highlights

విరసం కార్యదర్శి, ఓయు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీంపై పోలీసులు తీవ్రమైన అభియోగాలు మోపారు. కాశీంకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో లింక్స్ ఉన్నాయని వారు ఆరోపించారు. కాశీం భార్య స్నేహలతపై కూడా కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, విరసం కార్యదర్శి కాశీంపై పోలీసులు తీవ్రమైన అభియోగాలు మోపారు. కాశీం రిమాండ్ రిపోర్టులో ఆయన అభియోగాలను క్రోడీకరించారు. కాశీం భార్య స్నేహలతపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసును 54 మందిపై నమోదు చేశారు. 

స్నేహలత నడుస్తున్న తెలంగాణ అనే పత్రికను నడిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో తనకు సంబంధాలున్నాయని కాశీం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ప్రొఫెసర్ కాశీం పరారీలో ఉన్నారా..? పోలీసులకు న్యాయస్థానం అక్షింతలు

 మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్, పుల్లూరి ప్రసాదరావు, మల్లోజుల వేణుగోపాల్, కటకం సుదర్శన్ వంటి మవోయిస్టు అగ్రనేతలతో కాశీంకు సంబంధాలున్నాయని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.

కాశీంను పోలీసులు ఈ నెల 18వ తేదీన అరెస్టు చేశారు. తెలంగాణ విద్యార్్థి వేదిక, మహిళా చేతన వంటి పలు మావోయిస్టు అనుబంధ సంస్థలతో కాశీంకు సంబంధాలున్నాయని, 19 మావోయిస్టు అనుబంధ సంస్థ సమన్వయకర్తగా కాశీం పనిచేస్తున్నారని అందులో చెప్పారు. 

Also Read:విరసం కార్యదర్శి కాశీం అరెస్టు: హైకోర్టుకు వెళ్తామన్న భార్య

మావోయిస్టులకు ఆయుధాలను, కంప్యూటర్లను సరఫరా చేయడంలో కాశీం దిట్ట అని వ్యాఖ్యానించారు. తన కార్యకలాపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నారని పోలీసులు అన్నారు. మావోయిస్టు రిక్రూట్ మెంట్ లో కాశీంది కీలక పాత్ర అని ఆరోపించారు. ఈ మెయిల్స్ ద్వారా ఎన్ క్రిప్టెడ్ కోడ్ లో మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నాడని వారన్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే కాశీంను అరెస్టు చేసినట్లు తెలిపారు. 

కాశీం నుంచి 118 డాక్యుమెంటరీలు, 163 సీడీలు, 5 డిజిటల్ వీడియో క్యాసెట్లు4 పెన్ డ్రైవ్ లు, మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసు సోదాలు

click me!