ఓరేయ్ నువ్వు అసలు మనిషినేనా..? బైక్ ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్.. వీడియో వైరల్

Published : Apr 16, 2024, 04:42 PM IST
ఓరేయ్  నువ్వు అసలు మనిషినేనా..? బైక్ ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్.. వీడియో వైరల్

సారాంశం

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ లారీ బీభత్సం సృష్టించిన వీడియో వైరల్ అవుతోంది.   

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. అందులో కొన్ని ప్రాంక్‌లు, ఫన్నీ స్కిట్స్, వైల్డ్ లైఫ్ కు సంబంధించిన చాలా వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని మనల్ని నవ్విస్తాయి.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం మనల్నీ మొదట భయాభంత్రులకు గురి చేస్తుంది. అదే సమయంలో ఒళ్లుగగుర్పాటుకు లోనవుతుంది. ఇకపై రోడ్డుపై వెళ్లేటప్పడు మరింత జాగ్రత్త, అప్రమత్తంగా ఉండేలని గుర్తి చేస్తుంది. వాస్తవానికి ఇలాంటి వీడియోలను కేవలం సినిమాల్లోనే చూస్తాం .. అది కూడా గ్రాఫిక్స్ లో .. కానీ ప్రస్తుత వైరల్ వీడియో మాత్రం రియల్ గా జరిగింది. అది కూడా   తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డుననే. 

ఇంతకీ ఏం జరిగిందంటే..? 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఓ లారీ బీభత్సం సృష్టించింది. రాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టి, అలాగే.. కిలో మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో బైక్ నడిపే వ్యక్తి అప్రమత్తం కావడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. కానీ ఆ ద్విచక్రవాహనాదారుడు తన బైక్ ను కాపాడుకోవడానికి, ఆ లారీ డ్రైవర్ ను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి లారీ డోర్ పట్టుకొని వేళాడాడు. అయినా.. లారీ డ్రైవర్ కనీస మనవత్వం, కనీకరం లేకుండా లేకుండా ప్రవర్తించాడు. లారీ అసలు ఆపకుండా వేగంగా కొన్ని కిలో మీటర్లు దూరం అలానే తీసుకెళ్లాడు. ఈ ఘటనను గమనించిన ఇతర వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
 
వివరాల్లోకెళ్లే.. లారీ బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్ లోని ఒవైసీ హాస్పిటల్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే మార్గంలో చోటుచేసుకుంది. ఓ లారీ డ్రైవర్ ఐఎస్ సదన్ పరిధిలో ఆదివారం రాత్రి ఓ బైక్ ను వేగంగా  ఢీకొట్టాడు. దీంతో ఆ బైక్ లారీ ముందు చక్రాల మధ్యలో ఇరుక్కొని పోయింది. అయినా .. ఆ లారీ డ్రైవర్ తన లారీని ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బైక్ రోడ్డుకు రాక్కుంటూ.. మెరుగులు వస్తున్నా.. ఇతర వాహనాదారులు ఆపమని అరుస్తున్నా.. అలాగే.. బైక్ ను కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో బైక్ డ్రైవర్ లారీ డోర్ పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే, లారీ డ్రైవర్ పారిపోయే క్రమంలో లారీని ఆపడకుండా పోనివ్వడంతో లారీ డోర్ కు వేలాడుతూ సుమారు కిలో మీటరు దూరం ప్రయాణించి బైకర్ ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినట్టు తెలుస్తోంది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రవికుమార్ అనే వ్యక్తి ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశాడు. డియర్ సర్.. ఈ దారుణాన్ని చూడండి. ఇది ఒవైసీ హాస్పిటల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ రూట్ వరకు జరిగింది. దయచేసి.. ఈ మార్గంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయండని కోరాడు. ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీసులు వెంటనే స్పందించారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu