ఉత్తమ్ ముందే చెప్పారు: కొండా దంపతులపై వినయ్ ఫైర్

By pratap reddyFirst Published 8, Sep 2018, 2:24 PM IST
Highlights

తమ పార్టీపై కొండా సురేఖ దంపతులు చేసిన విమర్శలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత వినయ్ భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు.  టీఆర్ఎస్ ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. 

హైదరాబాద్: తమ పార్టీపై కొండా సురేఖ దంపతులు చేసిన విమర్శలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత వినయ్ భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు.  టీఆర్ఎస్ ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. 

కొండా దంపతులు స్వయంగా తన దగ్గరికి వచ్చి రాజకీయ జీవితం‌ కావాలని అడిగారని, కేసీఆర్ వారికి పెద్ద మనసుతో రాజకీయ జీవితం‌ ప్రసాదించారని ఆయన అన్నారు. పార్టీలో చేరిన తర్వాత కొండా నడవడిక మారిందని ఆయన అన్నారు. 


కొండా దంపతులకు కాంగ్రెస్‌తో రహస్య‌ అజెండా ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌లో‌ కొండా చేరికపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు. కొండా దంపతులవి చీకటి వ్యాపారాలని వ్యాఖ్యానించారు. 

టీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని కొండా దంపతులు ఎంతో ప్రయోజనం పొందారని తెలిపారు. కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొండా దంపతుల వంటి అవకాశవాదులకు టీఆర్‌ఎస్‌లో స్థానం‌ లేదని వినయ్ భాస్కర్ అన్నారు.

ఈ కింది కథనాలు చదవండి

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

Last Updated 9, Sep 2018, 2:12 PM IST