
కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు నిరసన సెగ తగిలింది. గన్నేరువరం మండలంలో పర్యటిస్తున్న రసమయిని యువకులు అడ్డుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధపై ప్రశ్నించారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం వరకు రోడ్లు అధ్వాన్నంగా వుంటే.. పట్టించుకోవడం లేదని నిలదీశారు. నియోజకవర్గంలో దళితబంధు పథకం ఎందుకు అమలు చేయడం లేదని యువకులు మండిపడ్డారు. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని రసమయి బాలకిషన్‌తో వాగ్వాదానికి దిగారు.