ప్రేమ పేరుతో మహిళలు, విద్యార్ధినులను ట్రాప్ చేసి వారి న్యూడ్ వీడియో కాల్స్‌ను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఇద్దరిని గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో వున్న నిఖిల్ కోసం గాలిస్తున్నారు.
గద్వాల న్యూడ్ కూల్ బ్లాక్‌మెయిల్ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు . బాధితులు ఫిర్యాదు చేయకపోయినా.. సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ రంగస్వామి తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గద్వాల న్యూడ్ కాల్, బ్లాక్‌మెయిల్ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.
ALso Read:ప్రేమ పేరుతో మహిళలు, విద్యార్ధినుల ట్రాప్... ఆపై న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్
కాగా.. గద్వాలకు చెందిన మహేశ్వర్ రెడ్డి , నిఖిల్‌లు ప్రేమ పేరుతో మహిళలు, విద్యార్ధినులను ట్రాప్ చేస్తున్నారు. మహిళలు న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేలా చేసి దానిని రికార్డ్ చేస్తున్నారు. తర్వాత బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు తాము చెప్పిన వారితో గడపాలంటూ వేధిస్తున్నారు. లేని పక్షంలో ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు పంపుతామని , సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో మహేశ్వర్ రెడ్డిని అరెస్ట చేశారు. పరారీలో వున్న నిఖిల్ కోసం గాలిస్తున్నారు.