చిత్రపరిశ్రమకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. షూటింగ్‌లకు ప్రోత్సాహం.. రూ. 2 కోట్ల వరకు ప్రోత్సాహకాలు!

By Mahesh KFirst Published Nov 5, 2022, 5:10 PM IST
Highlights

మధ్యప్రదేశ్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ రాష్ట్రంలో కనీసం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంటే కోటిన్నర నుంచి రూ.  కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ లొకేషన్‌ల చెల్లించే మొత్తం 75 శాతం వెనక్కి ఇచ్చేస్తున్నట్టు తెలిపింది
 

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ చిత్ర పరిశ్రమకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రాష్ట్రంలో కనీసం 50 శాతం షూటింగ్ జరుపుకునే చిత్రాలకు గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు ప్రోత్సాహకాలు లేదా రాయితీలు అందిస్తామని వెల్లడించింది. పర్భుత్వ లొకేషన్‌లకు చెల్లించే దానిలో 75 శాతం వెనక్కి ఇచ్చేస్తామని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ షూటింగ్ చేసుకోవాలన్నా సులువుగా అనుమతులు లభించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ సహా దక్షిణాది అన్ని సినీ ఇండస్ట్రీలకు వర్తిస్తుందని తెలిపింది. ఈ అద్భుత అవకాశాన్ని సినిమా దర్శక నిర్మాతలు సద్వినియోగం చేసుకుని మధ్యప్రదేశ్‌లోని అద్భుత ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయాలని పేర్కొంది. 

ఈ మేరకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు స్వయంగా వెల్లడించింది. ఈ ప్రకటన కోసం ఎంపీ టూరిజం బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరి హైదరాబాద్‌కు విచ్చేశారు. తమ రాష్ట్రంలో ఇండోర్ లేదా ఔట్‌డోర్ ఏ రీతిలోనైనా 50 శాతం షూటింగ్ చేసుకుంటే ఆ చిత్రానికి గరిష్టంగా కోటి నుంచి రెండు కోట్ల వరకు నగదు ప్రోత్సాహకాలు  ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చని ఉమాకాంత్ చౌదరి తెలిపారు. ప్రతీ విషయం పారదర్శకంగా ఉంటుందని అన్నారు. 

Also Read: IRCTC Tour Package: వేసవి సెలవల్లో సిమ్లా మంచు కొండల్లో కేవలం రూ. 35 వేలకే టూర్.. పూర్తి వివరాలు మీకోసం..

షూటింగ్‌కు పర్మిషన్లు మొదలు.. నిర్ణీత వ్యవధిలోనే రాయితీలు అందించడం దాకా ప్రతి విషయంలోనూ తాము పారదర్శకతను ఉంచుతామని తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అరుదైన, సందర్శనీయ ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకోవడమే ఈ స్కీమ్ వెనుక ఉన్న ఉద్దేశ్యమని వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించామని వివరించారు. 

ఈ అవకాశాన్ని వినియోగించుకుని ‘తప్పించుకోలేరు’ అనే చిత్రాన్ని నిర్మించిన తొలి దక్షిణాది సినిమా యూనిట్ నగదు ప్రోత్సాహకం అందుకుంది. తమ అనుభవాన్ని రుద్రాపట్ల వేణుగోపాల్ పంచుకున్నారు. నిర్మాతలు ఆచంట గోపీనాథ్, బెక్కెం వేణుగోపాల్, డీఎస్ రావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యువ దర్శకులు చందా గోవింద్ రెడ్డి, గౌతమ్ రాచిరాజు, రైటర్ రవిప్రకాశ్ తదితరులను ఉమాకాంత్ చౌదరికి రుద్రాపట్ల వేణుగోపాల్ పరిచయం చేశారు.

click me!