టీఆర్ఎస్ పార్టీకే మా ఓటు...రెండు గ్రామాల ఏకగ్రీవ తీర్మానం

By Arun Kumar PFirst Published Sep 13, 2018, 8:46 PM IST
Highlights

తెలంగాణ లో అసెంబ్లీ రద్దవడంతో ఎన్నికల వేడి మొదలైంది. తమ ప్రభుత్వ పాలనలో ప్రజలకోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను టీఆర్ఎస్ పార్టీ ప్రచార అస్త్రాలుగా వాడుతోంది. అయితే కొన్ని చోట్ల వీరి ప్రచారమేమీ అవసరం లేకుండానే టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష మద్దతు లభిస్తోంది. ఇలా టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తమ గ్రామస్తులంతా ఓటేస్తామని మానుకొండూరు నియోజకవర్గంలోని రెండు గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ వార్త టీఆర్ఎస్ శ్రేషుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
 
మానకొండూరు నియోజకవర్గంలోని చీలపూర్ పల్లి, ఎర్రవెల్లివాడ గ్రామస్తుల టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.  తమ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే వేస్తామని...ప్రతిపక్షాలు తమ ఊరికి ప్రచారం కోసం రావద్దంటూ గ్రామస్తులంతా తీర్మానించుకున్నారు.

ఈ గ్రామాలు గతంలో వేరే పంచాయితీల ఆదీనంలో ఉండేవి. తమ గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని వారు ఎన్నిసార్లు వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయితీల్లో వీటికి కూడా స్థానం లభించింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రసమయి బాలకిషన్ కు మాత్రమే ఈ సారి ఓట్లు వేయాలని ఈ రెండు గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు .అందువల్ల తమ ఊరికి ఓట్ల కోసం ఇతర పార్టీల నాయకులు రావద్దని బ్యానర్లు పెట్టి టీఆర్ఎస్ పార్టీపై అభిమానాన్ని చాటుకున్నారు.

click me!