మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి సమీపంలో ఒంటిగుడిసెతండాలో గుడుండా స్థావరాలపై దాడికి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులపై గ్రామస్థులు దాడికి దిగారు. దాడికి పాల్పడిన గ్రామస్తులపై కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి సమీపంలో ఒంటిగుడిసెతండాలో గుడుండా స్థావరాలపై దాడికి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులపై గ్రామస్థులు దాడికి దిగారు. దాడికి పాల్పడిన గ్రామస్తులపై కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
కిష్టారం గ్రామంలో రెండు వాహనాల్లో నలుగురు వ్యక్తులు గుడుంబా తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు ఆదివారం నాడు వారిని అదుపులోకి తీసుకొన్నారు.ఎక్సైజ్ పోలీసుల అదుపులో ఉన్న వారు ఇచ్చిన సమాచారం మేరకు ఒంటిగుడిసె తండాలో గుడుంబా తయారు చేస్తున్నట్టుగా తేలింది.
undefined
దీంతో ఎక్సైజ్ పోలీసులు ఒంటి గుడిసె తండాలో గుడుంబా స్థావరాలపై దాడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకొన్న గ్రామస్తులు ఎక్సైజ్ పోలీసులపై ఎదురు దాడికి దిగారు.
also read:వనస్థలిపురంలో కరోనా ఉధృతి, 8 కంటైన్మెంట్ జోన్లు: వారం పాటు రాకపోకలు బంద్
గుడుంబా స్థావరాలపై ధ్వంసం చేసేందుకు వచ్చిన ఎక్సైజ్ సీఐతో పాటు మరో ముగ్గురిపై గ్రామస్థులు దాడికి దిగారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎక్సైజ్ పోలీసులు జడ్చర్లకు తిరుగు ప్రయాణమయ్యారు.
లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దొరకకపోవడంతో మద్యం ప్రియులకు గుడుంబాను విక్రయించేందుకు తయారు చేస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గాయపడిన ఎక్సైజ్ పోలీసులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న ఎక్సైజ్ సీఐతో పాటు కానిస్టేబుళ్లను పరామర్శించారు.
దాడికి దిగిన వారిపై పీడీ యాక్టులు పెడతామని మంత్రి హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.