భూ రికార్డుల్లో తప్పులు దిద్దుతామంటూ మోసం.. మీసేవాను ధ్వంసం చేసిన గ్రామస్తులు

Siva Kodati |  
Published : Sep 23, 2022, 03:02 PM IST
భూ రికార్డుల్లో తప్పులు దిద్దుతామంటూ మోసం.. మీసేవాను ధ్వంసం చేసిన గ్రామస్తులు

సారాంశం

భూమి రికార్డుల్లో తప్పులు సరిచేస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మీ సేవా సెంటర్ నిర్వాహకులపై దాడికి దిగారు సిద్దిపేట జిల్లా ఇటిక్యాల గ్రామస్తులు. ఇరువర్గాలకు జరిగిన ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.   

సిద్దిపేట జిల్లా ఇటిక్యాలలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీ సేవా కేంద్రంపై దాడికి దిగారు గ్రామస్తులు. భూమి రికార్డుల్లో తప్పులు సరిచేస్తామంటూ డబ్బులు వసూలు చేశారని వారు ఆరోపించారు. మీ సేవా కేంద్రంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ నిమిత్తం మీ సేవా వద్దకు వచ్చారు ఆర్ఐ. ఇదే సమయంలో అధికారుల ముందే గ్రామస్తులకు, మీ సేవా నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలకు జరిగిన ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?