జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట .. అజారుద్దీన్‌ను తప్పించండి: హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

By Siva KodatiFirst Published Sep 23, 2022, 2:37 PM IST
Highlights

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు కొందరు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు. 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు కొందరు. భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి  జింఖానా గ్రౌండ్స్ లో శుక్రవారం నాడు టికెట్లు ఇచ్చారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి  జింఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్లు అందిస్తామని హెచ్ సీ ఏ తెలిపింది. దీంతో ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఇవాళ కూడా పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్స్ కు చేరుకున్నారు. ఆఫ్ లైన్ టికెట్లు లేవని కూడా హెచ్ సీ ఏ స్పష్టం చేసింది.  టికెట్లు అయిపోయాయని  ఆఫ్ లైన్ లో టికెట్ల కొనుగోలు కోసం ఎవరూ కూడా రావొద్దని హెచ్ సీ ఏ జింఖానా గ్రౌండ్స్ వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. 

Also REad:ఇలాంటివి సహజం.. మీతో ముచ్చట్లు పెట్టడానికి టైం లేదు : మంత్రి ఎదుటే అజారుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ నెల 15వ తేదీతో పాటు నిన్న ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం జరిపారు. టికెట్లు బుక్ చేసుకున్న ఐడీ , ఆధార్ కార్డు వివరాలతో జింఖానా గ్రౌండ్ వద్దకు వచ్చి టికెట్ తీసుకువెళ్లాలని హెచ్  సీ ఏ సూచించింది. దీంతో ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకున్నవారు  హెచ్ సీ ఏ సూచించిన ఆధారాలతో జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. నిన్న చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో ఇవాళ  ఎలాంటి ఇబ్బందులు  ఎదురు కాకుండా ఉండేందుకు గాను  పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.  ఆఫ్ లైన్ టికెట్ల కోసం వచ్చే వారిని పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.

click me!