నాకు ఈడీ నోటీసులు రాలేదు: కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్

By narsimha lodeFirst Published Sep 23, 2022, 2:40 PM IST
Highlights

తనకుఈడీ నుండి నోటీసులు రాలేదని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నేషనల్ హెరాల్డ్ కు తాను రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చినట్టుగా అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు.


హైదరాబాద్:తనకు ఈడీ నుండి నోటీసులు రాలేదని కాంగ్రెస్ పార్టీ నేత అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈడీ నోటీసులు ఇస్తే తాను సమాధానం చెబుతానని ప్రకటించారు.నేషనల్ హెరాల్డ్ కేసులో  తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుగు మీడియా చానెల్స్ కథనాలు ప్రసారం చేశాయి. ఈ  విషయమై ఓ తెలుగు న్యూస్ చానెల్ తో అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడారు. 

నేషనల్ హెరాల్డ్ పత్రికకు తాను రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చినట్టుగా అంజన్ కుమార్ యాదవ్ ఒప్పుకున్నారు.  చెక్ రూపంలోనే తాను ఈ విరాళం ఇచ్చినట్టుగా అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే  ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. 

వేల, లక్షల కోట్లున్న వారికి ఈడీ నోటీసులు ఇస్తుందన్నారు. కానీ తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని తన వద్దకు మీడియా ప్రతినిధులు  వస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం తాను రూ. 20 లక్షల చెక్ ను ఇచ్చినట్టుగా అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు.

also read:నేషనల్ హెరాల్డ్ కేసు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

తామంతా  నీతి, నిజాయితీగా ఉన్నవాళ్లమని అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏ విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామన్నారు.   కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నందునే తమపై కక్షగట్టి  నోటీసులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు 
 

click me!