సొంత అన్ననే చంపాలనుకున్న వికారాబాద్ డీటీవో.. కోటి రూపాయిల సుపారీకి డీల్.. కానీ చివ‌ర‌కు..

Published : Jul 23, 2022, 09:11 AM IST
సొంత అన్ననే చంపాలనుకున్న వికారాబాద్ డీటీవో.. కోటి రూపాయిల సుపారీకి డీల్.. కానీ చివ‌ర‌కు..

సారాంశం

అన్న హత్యకు ప్లాన్ చేసిన తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి విషయంలో ఇద్దరు అన్నదమ్ములకు మధ్య గొడవలు జరగడంతో తమ్ముడు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ హత్య కుట్రను అమలు చేసే క్రమంలోనే ఘటనను పోలీసులు ఛేదించారు. 

ఆయ‌న ఒక‌ ప్ర‌భుత్వ ఉన్న‌తోద్యోగి. స‌మాజంలో మంచి పేరు ప్ర‌తిష్ట‌లు ఉన్నాయి. త‌న అన్న‌తో క‌లిసి అనేక వ్యాపారాలు కూడా నిర్వ‌హిస్తున్నాడు. కానీ ఇద్ద‌రు అన్నద‌మ్ముల మ‌ధ్య కొంత కాలంగా ఆస్తి విష‌యంలో విబేధాలు త‌ల్లెత్తాయి. కొంత కాలంగా ఈ విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో అన్న‌ను అంతం చేయాల‌ని త‌మ్ముడు భావించాడు. దీని కోసం కిరాయి హంత‌కుల‌తో ఒప్పందం చేసుకున్నాడు. కోటి రూపాయిల‌కు డీల్ కుదిరింది. ఈ గ్యాంగ్ ఒక సారి నిందితుడి అన్నని చంపాల‌ని ప్ర‌య‌త్నిచింది. ఈ హ‌త్య కోసం ఈ గ్యాంగ్ లో ఓ వ్య‌క్తి మ‌రొక‌రిని హ‌త్య చేయాల్సి వ‌చ్చింది. ఈ హ‌త్య‌లో పోలీసులు నిందితుడిని ప‌ట్టుకొని విచారించ‌గా అసలు విష‌యం మొత్తం బ‌య‌ట‌పెట్టాడు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర‌ప్ర‌సాద్ శుక్ర‌వారం మీడియాతో వివ‌రాలు పంచుకున్నారు. వికారాబాద్ డీటీవోగా ప‌ని చేస్తున్న భ‌ద్రునాయ‌క్ స్వ‌స్థ‌లం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. ఆయ‌న‌కు బాణోతు వీరునాయ‌క్ అనే సోద‌రుడు ఉన్నాడు. వీర‌ద్ద‌రూ క‌లిసి ప‌లు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు ప్ర‌దేశాల్లో 132 ఎక‌రాల భూమి కొనుగోలు చేశారు. అలాగే ప‌లు ప్రాంతాల్లో ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేశారు. దీంతో పాటు గ్రానైట్ ఫ్యాక్ట‌రీలు భాగ‌స్వామ్యంతో కొనుగోలు వాటిని నిర్వ‌హిస్తున్నారు. అయితే గ్రానైట్ లో ప‌నులు చూసుకునేందుకు డీటీవో భ‌ద్రునాయ‌క్ త‌న చుట్ట‌మైన లునావ‌త్ హ‌రీష్ ను నియ‌మించుకున్నాడు. ఆయ‌న సూప‌ర్ వైజ‌ర్ గా విధులు నిర్వ‌హించేవాడు. 

కామారెడ్డిలో ఒకే విద్యార్థిని.. మూడుసార్లు కాటేసిన పాము.. !

అన్నీ సాఫీగా సాగిపోతున్నాయ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఆస్తి వివాదాలు త‌లెత్తాయి. ఉమ్మ‌డిగా సంపాదించిన ఆస్తిలో త‌న‌కు స‌గం వాటా కావాల‌ని డీటీవో సోదురుడు వీరునాయ‌క్ అడుగుతున్నాడు. కానీ దీనికి త‌మ్ముడు అంగీక‌రించ‌లేదు. దీంతో అన్న వీరునాయ‌క్ కు కోపం వ‌చ్చింది. ఉద్యోగంలో అక్ర‌మంగా డ‌బ్బులు సంపాదించావ‌ని తాను అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు తెలియ‌జేస్తాన‌ని హెచ్చ‌రించాడు. దీంతో త‌మ్ముడు అన్న‌పై కోపం పెంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే వీరునాయ‌క్.. హ‌రీశ్ ను ప‌ని నుంచి తొల‌గించాడు. 

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో క‌క్ష పెంచుకున్న భ‌ద్రునాయ‌క్ త‌న అన్న‌ని చంపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీని కోసం హ‌రీశ్ ను క‌లిశాడు. వీరునాయ‌క్ ను చంపితే కోటి రూపాయిలు, ఒక ఎక‌రం ల్యాండ్ ఇస్తాన‌ని డీల్ చేసుకున్నాడు. దీనికి అంగీకరించిన అత‌డు త‌న స్నేహితుల‌ను ఈ గ్యాంగ్ లో చేర్చుకున్నాడు. ఇందులో జక్కి సతీష్‌, గంట పరశురాములు, విజయ్ భరత్‌, రియాజ్‌, సంపంగి ప్రవీణ్‌లు ఉన్నారు. వీరంతా క‌లిసి గ‌త నెల 20వ తేదీ ఖ‌మ్మంకు వెళ్లారు. కానీ అక్క‌డ ఆయ‌న జాడ దొర‌క్క‌పోవ‌డంతో విఫ‌ల‌మ‌య్యారు. అదే నెల 30వ తేదీన ఇంకో సారి ప్ర‌య‌త్నించారు. ఈ సారి వీరునాయ‌క్ కారును మ‌రో కారుతో ఢీకొట్టించారు. క‌త్తుల‌తో పొడిచి చంపేయాల‌ని భావించారు. కానీ బాధితుడి వెంట మ‌రో ముగ్గురు వ్య‌క్తులు ఉండ‌టంతో వారు ఎదురుతిరిగారు. దీంతో ఆయ‌న దాని నుంచి సేఫ్ గా బ‌య‌ప‌ట్టాడు. 

వరంగల్ లో భారీ వర్షానికి పాత భవనం కూలి, ఇద్దరు మృతి...

అయితే అక్కడ అతని ఆచూకీ తెలుసుకోలేక తిరిగి వచ్చారు. జూన్‌ 30న మరోసారి ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం మండలంలోని కాకరవాయి, జూపెడ మధ్య వీరునాయక్‌ కారును వేరే కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి చంపే ప్రయత్నం చేశారు. అయితే తన వెంట ముగ్గురు వ్యక్తులు ఉండటంతో ప్రతిఘటించిన వీరునాయక్‌ తప్పించుకున్నాడు.  అయితే ఈ ప్లాన్ ను గ్యాంగ్ లో ఉన్న సంపంగి ప్ర‌వీణ్  వీరు నాయ‌క్ చెబుతున్నాడ‌ని హరీష్ కు డౌట్ వ‌చ్చింది. దీంతో డీటీవో ముందు సంప‌గినే చంపాల‌ని అత‌డికి చెప్పాడు. 

దీనికి ప్ర‌వీణ్ అంగీక‌రించాడు. ఈ క్ర‌మంలో జూలై 13వ తేదీన సంప‌గి ఇంటికి ప్ర‌వీణ్ వెళ్లాడు. పార్టీ ఉంద‌ని చెప్పి బ‌య‌ట‌కు తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు డ్రింక్ చేసి సూర్యాపేటలోని జక్కి సతీష్ సోద‌రుడు హరికృష్ణ రూమ్ కు వెళ్లి.. అక్క‌డే అత‌డ‌ని హ‌త్య చేశారు. అనంత‌రం మృత‌దేహాన్ని తీసుకొని కారులో అర్వ‌ప‌ల్లి మండ‌లంలోని తిమ్మాపురం ప‌రిస‌రాల్లోకి తీసుకెళ్లాడు. అక్క‌డ మృత‌దేహంపై మ‌ళ్లీ త‌ల‌పై రాయితో బాదారు. అనంత‌రం డెడ్ బాడీని డీటీవో కు వీడియా కాల్ చేసి చూపించారు. అయితే ఈ ఘ‌ట‌నపై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ద‌ర్యాప్తులో హ‌రీవ్ ను పోలీసులు ప‌ట్టుకున్నారు. అత‌డిని విచారించ‌గా వారి ప్లానింగ్ అంతా చెప్పేశాడు. దీంతో పోలీసులు నిందితుడు డీటీవోతో పాటు ఇందులో ప్ర‌మేయం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే