కామారెడ్డిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఓ విద్యార్థి కొద్ది రోజుల గ్యాప్ తో మూడుసార్లు పాము కాటుకు గురయ్యాడు.
కామారెడ్డి : పాములు పగ బడతాయా? అదేమో తెలియదు కానీ.. ఓ విద్యార్థి మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడుసార్లు వరుసగా మూడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ లోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి బర్ధవాల్ కృష్ణను శుక్రవారం ఓ పాము కాటు వేసింది. వెంటనే టీచర్లు అతడిని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు.
అయితే కృష్ణను పాము కాటు వేయడం ఇది మొదటి సారి కాదు అని తేలింది. పెద్ద కొడప్ గల్ మండలంలోని చావుని తండాకు చెందిన కృష్ణకు పాము కాటు వేయడం ఇది మూడోసారి. జూన్ 23న కూడా పెద్ద కొడప్ గల్ లోని బాలుర సంక్షేమ హాస్టల్ లో ఇదే విద్యార్తఇకి పాము కాటు వేసింది. గతంలోనూ ఒక ప్రైవేటు స్కూల్ లో కృష్ణను పాము కరిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
undefined
వరంగల్ లో భారీ వర్షానికి పాత భవనం కూలి, ఇద్దరు మృతి...
ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో హత్య చేసి పాముకాటుతో మృతి చెందారని కలరింగ్ ఇస్తున్న కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ వ్యక్తి తన స్నేహితుడిని హతమార్చి, పాము కాటుతో చనిపోయాడని కలరింగ్ ఇవ్వాలనుకున్నాడు. దీనికోసం మృతదేహం పక్కన చనిపోయిన నాగుపామును పడేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రాజేష్ సింగ్ భదౌరియా తెలిపిన వివరాల్లోకి వెడితే... మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృతుడి స్నేహితుడు సందీప్ బాగ్మారే ఇంట్లో బస్సు డ్రైవర్ నవల్ సింగ్ మృతదేహం లభ్యమైంది. అంతేకాదు “శవం పక్కన చనిపోయిన నాగుపాము కూడా పడి ఉంది. సింగ్, అతని స్నేహితులు రాత్రిపూట కలిసి మద్యం సేవించారని బాగ్మారే చెప్పారు ”అని భదౌరియా చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..,బాగ్‌మరే, సింగ్ కలిసి మద్యం సేవించిన తరువాత.. రాత్రి బాగా ఆలస్యం కావడంతో బాగ్మారే తన ఇంట్లో పడుకోమని సింగ్ ను కోరాడు. అయితే, మరుసటి రోజు ఉదయం, బాగ్మారే తన స్నేహితుడు చనిపోయాడని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన బాగ్‌మారే ఇంటికి చేరుకున్నారు. అక్కడ వారికి మృతదేహం దగ్గర చనిపోయిన నాగుపాము పడి ఉండటాన్ని వారు గమనించారు. దీని కారణంగా సింగ్ రాత్రిపూట పడుకున్నప్పుడు పాము కరవడం వల్ల మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానించారు.
అయితే, కేసు దర్యాప్తులో భాగంగా, మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ రిపోర్టులో మృతుడు పాము కాటు కారణంగా మరణించలేదని పోలీసులకు తెలిసింది. దీంతో అనుమానంతో బాగ్మారేను పోలీసులు ప్రశ్నించారు. అయితే, మొదట నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ తర్వాత సింగ్ నోటికి, ముక్కుకు గుడ్డ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు అంగీకరించాడు.